తెలుగు న్యూస్ / తెలంగాణ /
KISAN Agri Show 2025 : హైదరాబాద్ వేదికగా అతిపెద్ద ‘కిసాన్ అగ్రి షో’ - ప్రత్యేకతలివే
KISAN Agri Show 2025 in Hyderabad: హైదరాబాద్ వేదికగా అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన (కిసాన్ అగ్రి షో - 2025) జరగనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 9 వరకు కొనసాగనుంది. రాష్ట్రం వ్యాప్తంగా 30 వేల మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు.
కిసాన్ అగ్రి షో
తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన (కిసాన్ అగ్రి షో 2025)కు హైదరాబాద్ వేదిక కానుంది. కిసాన్ అగ్రి షో 3వ ఎడిషన్ ఫిబ్రవరి 7 నుంచి 9 వ తేదీ వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతుంది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు, మార్గదర్శకులు, రైతులను ఒకే వేదికపైకి తీసుకురావడం జరురుగుతుంది. ఫలితంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ ప్రదర్శన తోడ్పడనుంది.

కిసాన్ అగ్రి షో 2025 - విశేషాలు:
- ఈ ప్రదర్శన 12,000 చదరపు మీటర్ల భారీ ప్రాంగణ విస్తీర్ణంలో మూడు రోజుల పాటు జరుగుతుంది. దాదాపు 150 కంపెనీలకు పైగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాయి.
- వ్యవసాయంలో తాజా ఉత్పత్తులు, వినూత్న ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శించబడతాయి.
- హైదరాబాద్‌లో కిసాన్ వ్యవసాయ ప్రదర్శన యొక్క మొదటి రెండు ఎడిషన్‌లు విజయవంతంగా ముగిశాయి. ఈ మూడవ ఎడిషన్‌కు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి 30,000 మందికి పైగా సందర్శకులు వస్తారని భావిస్తున్నారు.
- ఇందులో వ్యవసాయం, ఉద్యానవన శాఖ మరియు ఇతర విభాగాలు పాల్గొంటున్నాయి. వారు రైతులకు అత్యుత్తమమైన, ప్రయోజనకరమైన విధానాలు, పథకాలను ప్రదర్శిస్తారు.
- కిసాన్ హైదరాబాద్ 2025 ప్రదర్శనకారులు తమ వినూత్న ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడానికి ఇది వేదిక కానుంది.
- ఈ తరహా ప్రయత్నం పరిశ్రమలోని అధునాతన పరిణామాలను పంచుకోవడానికి, చర్చించడానికి వీలుగా వాతావరణాన్ని నెలకొల్పుతోంది. తద్వారా స్థానిక ప్రగతిశీల, ఉత్తమ రైతులు సమావేశమవుతారని నిర్వహకులు భావిస్తున్నారు.
- నెట్‌వర్కింగ్ తో పాటు వ్యవసాయ రంగంలోని విజ్ఞాన మార్పిడికి అగ్రి కిసాన్ షో ప్రధాన వేదికగా మారనుంది.
- కిసాన్ ప్రదర్శనలో వ్యవసాయ యంత్రాలు, నీరు-నీటిపారుదల, ప్లాస్టికల్చర్, సురక్షిత సాగు, వ్యవసాయంలో సాంకేతికత, కాంట్రాక్ట్ వ్యవసాయం వంటి వాటి అంశాలు చర్చకు వస్తాయి.
- ఈ అతిపెద్ద ప్రదర్శన ద్వారా రైతులకు వారి ఆసక్తి ఉన్న విషయాలను తెలిపే వీలు ఉండటంతో పాటు ప్రోత్సహించడానికి కూడా సహాయపడుతుంది.
సంబంధిత కథనం