Siddipet Constable Suicide Case : ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగులతోనే కానిస్టేబుల్ కుటుంబ ప్రాణాలు బలి!
Siddipet Gunman Suicide Case Updates: సిద్ధిపేటలో కానిస్టేబుల్ నరేశ్ కుటుంబం సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగులే కానిస్టేబుల్ కుటుంబ ప్రాణాలు తీసినట్లు తెలిసింది.
Siddipet Collector Gunmen Suicide: ఆన్లైన్ లో రమ్మీ గేమ్, ఇతర గేములు, బెట్టింగ్ లకు అలవాటు పడటమే సిద్దిపేట కలెక్టర్ గన్ మెన్ అయినా ఆకుల నరేష్, తన కుటుంబ సభ్యుల ప్రాణాలు తీశాయని నరేష్ బంధువులు, స్నేహితులు వాపోతున్నారు. 2013లో ఏఆర్ కానిస్టేబుల్ గా జాబ్ లో విధుల్లో చేరిన నరేష్, ఎనిమిది సంవత్సరాల కింద సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన చైతన్యతో వివాహం అయ్యింది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్ గేమ్ లకు, బెట్టింగ్ కు అలవాటుపడిన నరేష్ తీవ్ర అప్పుల పాలయినట్టు తెలుస్తుంది. ఆన్లైన్ యాప్ లో నుండి అధిక మిత్తికి డబ్బులు తీసుకోవడంతో, అప్పులు ఇంకా పెరిగిపోయాయి. ఆ అప్పులు తీర్చడానికి, తను స్నేహితుల వద్ద, బంధువుల వద్ద, తెలిసిన వారి వద్ద అప్పులు చేయడంతో, మిత్తితో కలిపి అవి ఇంకా ఎక్కువైపోయాయి.

భూమి అమ్మిన తీరని అప్పు...
చేసిన అప్పులు తీర్చడానికి, తండ్రి నుంచి సంక్రమించిన ఒక ఎకరం భూమిని 42 లక్షలకు అమ్మాడు. అందులో 30 లక్షలు అప్పువారికి కట్టగా, మిగతావి తన తల్లి తండ్రులకు ఇచ్చాడు. చైతన్య తల్లితండ్రులు కూడా అప్పులు తీర్చడానికి, మరొక 10 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయినా, తాను చేసిన అప్పులు ఇంకా 50 లక్షలకు పైనే ఉండటంతో, అప్పు ఇచ్చిన వారినుండి రోజు రోజు వత్తిడి పెరుగుతుంది. ఇంతకుముంది, సిద్దిపేట లో ఒక కిరాయి ఇంట్లో నివసించిన నరేష్, తన స్వంత గ్రామమైన రామునిపట్లకు షిఫ్ట్ అయ్యాడు. తన భార్య సిద్దిపేటలోని ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తుంది, అదే స్కూల్ లో పిల్లలు రేవంత్ (7) , హితశ్రీ (5), ఒకటో తరగతి, యూకేజీ చదువుతున్నారు. శుక్రవారం పొద్దున కూడా, నరేష్ కు అప్పు ఇచ్చిన ఒక వ్యక్తి గ్రామానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తికి నచ్చచెప్పి, సిద్దిపేట కు డ్యూటీకి వెళ్ళాడు.
స్కూల్ కి వెళ్ళే వారిని ఆపి....
కలెక్టర్ సిద్దిపేటలో లేకపోవటంతో మల్లి తిరిగి ఇంటికి తన సర్వీస్ పిస్టల్ తో సహా వచ్చాడు. స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అయిన చైతన్యను, పిల్లలను వారించిన నరేష్, సుమారుగా శుక్రవారం 11 గంటల 15 నిముషాలకు భార్యను పిల్లలను ముగ్గురిని అదే పిస్టల్ తో కాల్చి చంపి, తను కూడా కాల్చుకున్నాడు. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించినా నరేష్, తమ బాగోగులు చూసుకుంటాడు అని అనుకుంటే తానే ప్రాణాలు తీసుకున్నాడని తన తల్లితండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ సంఘటనతో, రామునిపట్ల గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామస్తులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య, శుక్రవారం సాయంత్రం వారి నలుగురికి అంత్యక్రియలు జరిపారు. సంఘటన వివరాలు తెలుసుకోవడానికి గ్రామానికి వచ్చిన, సిద్దిపేట పోలీస్ కమీషనర్, ఎన్ శ్వేతా మాట్లాడుతూ తాము ఇంకా విచారణ చేస్తున్నామని. నరేష్ ఫోన్ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నామని తెలిపారు. తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తుందని, పూర్తీ విచారణ తరువాత తాము ఒక నిర్ణయానికి రాగాలుకుతామని ఆమె అన్నారు.
రిపోర్టింగ్: ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి
సంబంధిత కథనం