ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ - అజెండాలో కీలకాంశాలు, ఉద్యోగులకు తీపి కబురు ఉండేనా..?-key decisions likely to be taken in telangana cabinet meeting today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ - అజెండాలో కీలకాంశాలు, ఉద్యోగులకు తీపి కబురు ఉండేనా..?

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ - అజెండాలో కీలకాంశాలు, ఉద్యోగులకు తీపి కబురు ఉండేనా..?

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా తేదీ, బనకచర్ల, కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదికతో పాటు ఉద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

తెలంగాణ కేబినెట్ భేటీ (ఫైల్ ఫొటో)

ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

కేబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ, రైతు భరోసా స్కీమ్ తేదీతో పాటు బనకచర్ల ప్రాజెక్ట్ తో పాటు కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే రాజీవ్ యువ వికాసం స్కీమ్ శాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఈ విషయంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో యువ వికాసం స్కీమ్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పనులు కొనసాగుతున్నాయి. లబ్ధిదారులుగా ఎంపికైన వారికి మంజూరు పత్రాలను అందజేస్తారు. ఈ స్కీమ్ అమలుపై కేబినెట్ లో చర్చ జరగనుంది. అంతేకాకుండా విద్యుత్ ​కొనుగోళ్ల ఒప్పందాలు, భూదాన్ ​భూముల వ్యవహారంతో పాటు భూ భారతి చట్టం అమలు వంటి పలు అంశాలపై మంత్రివర్గం చర్చించే ఛాన్స్ ఉంది.

ఉద్యోగులకు తీపి కబురు ఉండేనా…?

నేటి కేబినెట్ భేటీపై ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. పెండింగ్ డీఏలతో పాటు ఇతర సమస్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ…. పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దీటైన పరిష్కారాలు తీసుకురావాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఆదాయ, వ్యయాలపై సమీక్ష చేస్తూనే…. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ బాధ్యతని చెప్పుకొచ్చారు.

ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై అధికారుల నివేదికను సమర్పించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామ

పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దీటైన పరిష్కారాలు తీసుకురావాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ఆదాయ, వ్యయాలపై సమీక్ష చేస్తూనే, ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటున్నాం.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.