BRSLP Leader : బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక-kcr was elected as the leader of brs legislature party leader ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brslp Leader : బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక

BRSLP Leader : బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక

BRSLP Leader KCR:బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు కేసీఆర్ పేరును ఆ పార్టీ ఎమ్మెల్యేలు బలపరిచారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

BRSLP Leader KCR: బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. బీఆర్ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. శాసనసభా పక్ష సమావేశంలో కేసీఆర్ పేరును పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా.. తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. కేసీఆర్‌ ఎన్నిక అంశాన్ని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి లేఖగా ఇవ్వనున్నారు.

ప్రతిపక్ష నేతగా కేసీఆర్….

తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్… ప్రతిపక్ష స్థానంలోకి వచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకుని రెండోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా… ఇవాళ (డిసెంబర్ 9వ) తేదీన నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఉండనుంది. కాంగ్రెస్ తర్వాత మెజార్టీ స్థానాలను గెలిచిన బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా దక్కనుంది. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నికైన నేపథ్యంలో… ఆయనే ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు.

ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్. ఎముక మార్పిడి సర్జరీ అయిన నేపథ్యంలో… ఆరు నుంచి 8 వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు. ఇవాళ 38 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనుండగా… కేసీఆర్ మాత్రం తర్వాత ప్రమాణం చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.