KCR National Politics : కేసీఆర్ స్పెషల్ ఫ్లైట్.. రూ.80 కోట్లు అంట?-kcr special flight for national politics ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kcr Special Flight For National Politics

KCR National Politics : కేసీఆర్ స్పెషల్ ఫ్లైట్.. రూ.80 కోట్లు అంట?

HT Telugu Desk HT Telugu
Oct 02, 2022 03:14 PM IST

KCR Special Flight : సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు ప్రత్యేక విమానాన్ని టీఆర్ఎస్ పార్టీ బుక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

కేసీఆర్
కేసీఆర్ (Stock Photo)

సీఎం కేసీఆర్ కేంద్ర విధానాలపై ఎప్పటి నుంచో విమర్శలు చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి ఆయన జాతీయ పార్టీ(National Party) పెడతారనే ప్రచారం సాగుతోంది. దసరాకు నేషనల్ పార్టీ లాంచ్ అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే పార్టీ ఏర్పాటు చేశాక.. ఇతర రాష్ట్రాల్లోనూ సభలు, సమావేశాలు పెట్టాల్సి ఉంటుంది. దేశమంతా తిరగాలంటే.. విమానం తప్పనిసరి. దీంతో ప్రత్యేక విమానాన్ని టీఆర్ఎస్ (TRS) బుక్ చేయాలని చూస్తున్నట్టుగా సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

ఇందులో భాగంగానే జాతీయ పార్టీ కోసం.. ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకోనున్నారు. 12 సీట్లున్న విమానాన్ని బుక్ చేయాలని టీఆర్ఎస్(TRS) భావిస్తోంది. భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రారంభించిన తర్వాత రాబోయే నెలల్లో దేశం అంతటా తిరిగేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

దసరా రోజున అంటే అక్టోబరు 5న BRSను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉన్నందున.. అదే రోజు విమానం బుక్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో వేర్వేరు గమ్యస్థానాలకు వెళ్లే సమయంలో ఈ ఫ్లైట్ ఉపయోగపడనుంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చార్టర్డ్ విమానాలను వాడుతున్నారు. విమానం ఎనిమిది సీట్లు లేదా 12 సీట్లు ఉండవచ్చనే ఊహాగానాలు చెలరేగినప్పటికీ, టీఆర్‌ఎస్ అధినేత ఆరు సీట్ల జెట్‌కు ఒకే అన్నట్టుగా తెలుస్తోంది.

అయితే దీని ఖ‌రీదు సుమారు రూ.80 కోట్ల వరకూ ఉంటుదని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిధుల‌ను పార్టీ నేత‌ల నుంచి విరాళాల రూపంలో సేక‌రించే అవకాశం ఉంది. పార్టీ వ‌ద్ద ఇప్పటికే రూ.865 కోట్ల నిధులున్నట్టుగా తెలుస్తోంది. వీటిని జాతీయ‌స్థాయి స‌భ‌లు, స‌మావేశాల‌కు, పార్టీ సంబంధిత ఖ‌ర్చుల‌కు ఉపయోగించే ఛాన్స్ ఉంది.

అయితే.. తెలంగాణ అంటే టీఆర్ఎస్ అన్నట్లుగా ప్రస్తుతం రాజకీయం సాగుతోంది. అలాంటింది తెలంగాణ రాష్ట్ర సమితి లేని తెలంగాణ(Telangana) రాజకీయాలను ఊహించగలమా అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారనేది ఇంట్రెస్టింగ్ మారింది. పార్టీ ప్రకటిస్తే.. టీఆర్ఎస్ తో పాటు జాతీయ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఉండలేరు.

ఎన్నికల సంఘం నిబంధనలు కూడా వర్తించవు. ప్రకటిస్తే ప్రస్తుతం ఉన్న అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా కొత్త పార్టీ ప్రకటిస్తే.. టీఆర్ఎస్ గుర్తింపుపై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అయితే టీఆర్ఎస్ అలా ఉంటుందని పలువురు అంటున్నారు. బీఆర్ఎస్ పెట్టినప్పటికీ… అనుబంధంగా ఉండే ఛాన్స్ ఉందంటూ ఎవరికి వారు విశ్లేషిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం