KCR National Party : కేసీఆర్ పాన్ ఇండియా పార్టీ గుర్తు ఇదే.. పేరు ఏంటంటే?-kcr new national party symbol and name finalized key decisions in trs party leaders meeting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kcr New National Party Symbol And Name Finalized Key Decisions In Trs Party Leaders Meeting

KCR National Party : కేసీఆర్ పాన్ ఇండియా పార్టీ గుర్తు ఇదే.. పేరు ఏంటంటే?

HT Telugu Desk HT Telugu
Oct 02, 2022 06:17 PM IST

KCR National Politics : తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. కొత్త పార్టీ పెట్టేందుకు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (Stock Photo)

సీఎం కేసీఆర్(CM KCR) పాన్ ఇండియా పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు. ఈ మేరకు కొత్త పార్టీ ప్రకటనపై ముహూర్తం ఖరారు అయింది. అక్టోబర్ 5న దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటన ఉండనుంది. ఇప్పటికే దేశంలోని పలువురు సీఎంలు, సామాజికవేత్తలతో కేసీఆర్ జాతీయ పార్టీపై చర్చించారు. తాజాగా టీఆర్ఎస్(TRS) నేతలతో భేటీ ముగిసింది.

ట్రెండింగ్ వార్తలు

దసరా రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. పార్టీ పేరు మారినా.. కారు(Car) గుర్తే ఉంటుందని కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి(BRS)గా పార్టీ పేరును ఖరారు చేసినట్టుగా సమాచారం. అయితే కొత్త పార్టీ అంటే సమస్యలు వస్తాయని.. ఉన్న పార్టీ పేరును మార్చుకుంటే ఎలాంటి సమస్య ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అక్టోబర్ 5న ఉదయం 11 గంటలకు మరోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మెుత్తం 283 మందితో సమావేశం అవుతారు.

సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ తీర్మానం చేయనున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాలి. దసరా రోజు పార్టీ నేతలతో మరోసారి సమావేశం అనంతరం.. పార్టీ ఏర్పాటు, ప్రకటనపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 9న దిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.

అయితే పార్టీ ఏర్పాటు చేశాక.. ఇతర రాష్ట్రాల్లోనూ సభలు, సమావేశాలు పెట్టాల్సి ఉంటుంది. దేశమంతా తిరగాలంటే.. విమానం తప్పనిసరి. దీంతో ప్రత్యేక విమానాన్ని టీఆర్ఎస్ బుక్ చేయాలని చూస్తున్నట్టుగా సమాచారం.

ఇందులో భాగంగానే జాతీయ పార్టీ కోసం.. ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకోనున్నారు. 12 సీట్లున్న విమానాన్ని బుక్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. భారతీయ రాష్ట్ర సమితి (BRS) ప్రారంభించిన తర్వాత రాబోయే నెలల్లో దేశం అంతటా తిరిగేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

దసరా(Dussehra) రోజున విమానం బుక్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో వేర్వేరు గమ్యస్థానాలకు వెళ్లే సమయంలో ఈ ఫ్లైట్ ఉపయోగపడనుంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చార్టర్డ్ విమానాలను వాడుతున్నారు. విమానం ఎనిమిది సీట్లు లేదా 12 సీట్లు ఉండవచ్చనే ఊహాగానాలు చెలరేగినప్పటికీ, టీఆర్‌ఎస్ అధినేత ఆరు సీట్ల జెట్‌కు ఒకే అన్నట్టుగా తెలుస్తోంది.

అయితే దీని ఖ‌రీదు సుమారు రూ.80 కోట్ల వరకూ ఉంటుదని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిధుల‌ను పార్టీ నేత‌ల నుంచి విరాళాల రూపంలో సేక‌రించే అవకాశం ఉంది. పార్టీ వ‌ద్ద ఇప్పటికే రూ.865 కోట్ల నిధులున్నట్టుగా తెలుస్తోంది. వీటిని జాతీయ‌స్థాయి స‌భ‌లు, స‌మావేశాల‌కు, పార్టీ సంబంధిత ఖ‌ర్చుల‌కు ఉపయోగించే ఛాన్స్ ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం