BRS Party : ఈ రాష్ట్రాలపై బీఆర్ఎస్ ఫోకస్.. మెుదట పోటీ ఇక్కడే-kcr bharat rashtra samithi focus on these states ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kcr Bharat Rashtra Samithi Focus On These States

BRS Party : ఈ రాష్ట్రాలపై బీఆర్ఎస్ ఫోకస్.. మెుదట పోటీ ఇక్కడే

Anand Sai HT Telugu
Oct 05, 2022 04:47 PM IST

KCR National Party : కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే మెుదట కేసీఆర్ జాతీయ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందనే ఆసక్తి సహజంగానే అందరిలోనూ నెలకొంది. ఇంతకీ ఏ రాష్ట్రాల్లో మెుదట పోటీ చేస్తారు?

బీఆర్ఎస్ పార్టీ తీర్మానం చదివి వినిపిస్తున్న కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ తీర్మానం చదివి వినిపిస్తున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి.. ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారింది. ఎప్పటి నుంచో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చర్చ జరుగుతున్న అంశానికి తెరపడింది. ఇక పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాలపై ఆయన దృష్టిపెట్టనున్నట్టుగా క్లారిటీ వచ్చింది. కేసీఆర్ అక్టోబర్ 5న తన జాతీయ పార్టీ ప్రకటనతో ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి కీలకమైన అడుగు వేశారు. కేసీఆర్ జాతీయ పార్టీ ముందుగా కర్ణాటక, గుజరాత్‌లతో బలాలను పరీక్షించే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

2018లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలం సాధించడంలో బీజేపీ విఫలమైంది. 2019లో హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేసింది. కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) నుండి ఫిరాయింపులతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కర్ణాటకలో జేడీ(ఎస్)తో పొత్తుపై కేసీఆర్ దృష్టి సారించారు. ఆయన ఇప్పటికే జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ, ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పలు సమావేశాలకు హాజరయ్యారు. తాజాగా జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా కుమారస్వామి కూడా వచ్చారు.

అదేవిధంగా గుజరాత్‌లో శంకర్‌సింగ్ వాఘేలాకు చెందిన జన వికల్ప్ మోర్చాతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 92 ఏళ్ల వాఘేలా మాజీ జనసంఘ్ నాయకుడు, కేశుభాయ్ పటేల్, నరేంద్ర మోదీతో పాటు గుజరాత్‌లో బీజేపీని నిర్మించిన ముగ్గురిలో ఈయన ఒకరు. వాఘేలా చివరికి కేశూభాయ్, మోదీతో విభేదించాడు. తన సొంత రాజకీయ మార్గాన్ని ఎంచుకుని బీజేపీ నుంచి బయటకు వచ్చేశారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా కేసీఆర్ వాఘేలా మిత్రులయ్యారు.

నిజాం పాలనలో ఒకప్పుడు హైదరాబాద్ ప్రావిన్స్‌లో భాగంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంపై కేసీఆర్ మొదట దృష్టి సారిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఆయన దృష్టిలో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న ప్రాంతాలూ ఉన్నాయి. ఒక్కలిగాలకు బలమైన కోటగా ఉన్న పాత మైసూరు ప్రాంతం ఒకప్పుడు JD(S)కి కంచుకోటగా ఉండేది. గౌడ కుటుంబం ఒక్కలిగ మద్దతుకు దూరమవడంతో ఈ ప్రాంతంపై పార్టీ పట్టు కోల్పోయింది. జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకుని కేసీఆర్ ఈ ప్రాంతంలోకి అడుగుపెడితే ఆ తర్వాతి అవకాశాలు మెరుగుపడవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్‌, జేడీ(ఎస్‌)కు సహాయం చేయడంతో ఎంతో కొంత కలిసి వస్తుందంటున్నారు. కర్ణాటక రాజకీయాల్లో కేసీఆర్ చిన్న ఆటగాడు మాత్రమేనని.. అయితే ఆయన పార్టీ ఖచ్చితంగా తెలుగు మాట్లాడే ప్రజలను ప్రభావితం చేస్తుందనే అభిప్రాయాలు మెుదలయ్యాయి.

గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సాధించిన విజయాలు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు ఇవన్నీ కేసీఆర్ కు కోపం తెప్పించాయి. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించడం కూడా కేసీఆర్ నుంచి తెలంగాణను కైవసం చేసుకోవాలనే బీజేపీ ప్లాన్ కనిపించింది. దీంతో కేసీఆర్ తన జాతీయ పార్టీ ప్రణాళికలను వేగవంతం చేశారు.

కేసీఆర్ జాతీయ స్థాయికి వెళ్లడంతో అక్టోబర్ 14 నుంచి విజయవాడలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలు బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష నేతల కలయికకు వేదిక కావచ్చని భావిస్తున్నారు. బీజేపీ మత రాజకీయాలకు వ్యతిరేకంగా తమ పోరాటంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జేడీ(యూ) నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఆహ్వానించాలని పార్టీ నిర్ణయించిందని కమ్యూనిస్టు నేత ఒకరు చెప్పారు.

డిసెంబర్ మొదటి వారంలో కేసీఆర్ దేశ రాజధానిలో ర్యాలీకి నాయకత్వం వహించనున్నారు. ఇందులో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్, RJD తేజస్వి యాదవ్, JD (S) కుమారస్వామి, JVM యొక్క శంకర్‌సింగ్ వాఘేలా వంటి నాయకులు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధినేతగా ఆయన తనయుడు కేటీఆర్ బాధ్యతలు చూసుకునే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం