Kasani Joins BRS : కారెక్కిన ‘కాసాని’.. ఈటలను ప్రస్తావిస్తూ కేసీఆర్ ఏమన్నారంటే..-kasani gnaneshwar joined brs presence of kcr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kasani Joins Brs : కారెక్కిన ‘కాసాని’.. ఈటలను ప్రస్తావిస్తూ కేసీఆర్ ఏమన్నారంటే..

Kasani Joins BRS : కారెక్కిన ‘కాసాని’.. ఈటలను ప్రస్తావిస్తూ కేసీఆర్ ఏమన్నారంటే..

Telangana Assembly Elections 2023: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసానికి గులాబీ కండువా కప్పి కేసీఆర్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

Kasani Gnaneshwar Joined in BRS : టీటీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్… బీఆర్ఎస్ గూటికి చేరారు. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్… "ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. కాసాని జ్ణానేశ్వర్ నాకు పాత మిత్రులు, ఎప్పుడో రావాల్సింది మీదగ్గరికి కాస్త లేటైందని” అన్నారు. బండ ప్రకాష్ తో పాటు కాసాని కి సముచితం స్థానం కల్పించేవాడిని, ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యేందుకు బీఆర్ఎస్ లోకి వచ్చినందుకు మనస్పూర్తిగా స్వాగతం తెలుపుతున్నాను అని చెప్పారు. రానున్న రోజుల్లో ముదిరాజ్ సామాజికవర్గ నాయకులకు చాలా అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు. రాజ్యసభ, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు ఇలా ఎన్నో పదవులు వరిస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు.

ముదిరాజ్ సామాజికవర్గానికి ప్రభుత్వ పరంగా ఎన్నో పథకాలను అమలు చేశామని, రాజకీయంగానూ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు కేసీఆర్.ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లినా అంతకంటే పెద్దనాయకులు కాసాని, మిగతా నాయకులు, అతని అనుచరులంతా బీఆర్ఎస్ కుటుంబంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.