ACB Arrest : ఏసీబీకి చిక్కిన ఐకేపీ కో-ఆర్డినేటర్, వీవోఏ నుంచి రూ. 10 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ సురేష్-karimnagar ikp coordinator caught by acb taking 10k bribe from voa ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Acb Arrest : ఏసీబీకి చిక్కిన ఐకేపీ కో-ఆర్డినేటర్, వీవోఏ నుంచి రూ. 10 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ సురేష్

ACB Arrest : ఏసీబీకి చిక్కిన ఐకేపీ కో-ఆర్డినేటర్, వీవోఏ నుంచి రూ. 10 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ సురేష్

HT Telugu Desk HT Telugu

ACB Arrest : కరీంనగర్ జిల్లా ఐకేపీ కమ్యూనిటీ కో ఆర్టినేటర్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వీవోఏకు సంవత్సరం జీతం రూ.60 వేలు ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది.

ఏసీబీకి చిక్కిన ఐకేపీ కో-ఆర్డినేటర్, వీవోఏ నుంచి రూ. 10 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ సురేష్

ACB Arrest : పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఐకేపీ కమ్యూనిటీ కో ఆర్డినేటర్ సురేష్ వీవోఏకు సంవత్సరం జీతం రూ.60 వేలు ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తొలి విడతగా పది వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన స్వప్న గత నాలుగు సంవత్సరాల నుండి గ్రామైఖ్య సంఘం సహాయకురాలుగా పని చేస్తుంది. తనకు రావాల్సిన సంవత్సర జీతం రూ.60 వేల చెక్కును ఇవ్వడానికి రూ.20 వేలు డిమాండ్ చేశాడు కోఆర్డినేటర్ సురేష్. అయితే తనకు వచ్చే జీతం కేవలం నెలకు ఐదు వేలని, తాను అన్ని డబ్బులు ఇవ్వలేనని బతిమిలాడిన సదరు కోఆర్డినేటర్ వినకపోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. మొదటగా పది వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ అధికారులు ఎవరు లంచం డిమాండ్ చేసిన తమను ఆశ్రయించాలని న్యాయం చేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఏసీబీ చిక్కిన ట్రాన్స్ కో ఆర్టిజన్ అబ్దుల్ రెహమాన్

రూ.20 వేలు లంచం తీసుకుంటూ హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ డివిజన్‌ కు చెందిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సహకార సంఘంలోని గ్రేడ్ -IV ఆర్టిసజన్ అబ్దుల్ రెహమాన్ ఏసీబీకి చిక్కారు. ఫిర్యాదుదారుని పాత మీటర్‌లో కనిపించే నష్టాన్ని వెల్లడించకుండా ఉండేందుకు జరిమానా విధించకుండా ఉండడానికి అధికారిక అనుకూలతను చూపినందుకు అతని నుండి రూ.20 వేలు డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని ఫిర్యాదుదారుని నుంచి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

మూడు నెలల్లో 52 కేసులు...

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు జనవరి నుండి మార్చి-2025 వరకు 52 కేసులను నమోదు చేసింది. అందులో 37 ట్రాప్ కేసులు, 4 అక్రమ ఆస్తుల కేసులు, 4 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 3 రెగ్యులర్ ఎంక్వైరీలు, 1 సర్‌ప్రైజ్ చెక్, 3 డిస్‌క్రీట్ ఎంక్వైరీలు ఉన్నాయి. ఆరుగురు అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులు/ప్రైవేట్ వ్యక్తులతో సహా 55 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ట్రాప్ కేసుల్లో రూ. 12,33,500/- మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివిధ విభాగాల డిఎ కేసులలో రూ.4,79,28,767/- విలువైన ఆస్తులను వెలికితీశారు.

ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే, చట్టం ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ACB యొక్క టోల్ ఫ్రీ నంబర్ అంటే 1064ను సంప్రదించాలని అభ్యర్థించారు. ACB, తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌లైన Whatsapp (9440446106), Facebook (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@TelanganaACB) ద్వారా కూడా సంప్రదించవచ్చని, బాధితుడు, ఫిర్యాదుదారుడి పేరు వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసిబి అధికారులు ప్రకటించారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం