Kamareddy Passport Office: కామారెడ్డి పాస్‌పోర్టు కార్యాలయం అగ్నికి ఆహుతి
Kamareddy Passport Office: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాస్‌పోర్టు కార్యాలయం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. ఈ ఘటనలో డాక్యుమెంట్లు, కంప్యూటర్లు దగ్ధం అయ్యాయి.
Kamareddy Passport Office: కామారెడ్డి పాస్‌పోర్ట్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కార్యాలయం నుంచి పెద్దఎత్తున పొగలు రావడంతో విధుల్లో ఉన్న వాచ్‌మెన్ అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. కానీ అప్పటికే కార్యాలయం పూర్తిగా దగ్ధమయ్యింది.
ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు పాస్‌పోర్టు కార్యాలయ సీనియర్ సూపరిండెంట్ జనార్దన్ రెడ్డి ( నిజామాబాద్ ) తెలిపారు. కామారెడ్డి జిల్లాలో పాస్‌పోర్టు కార్యాలయం ఫిబ్రవరి 20, 2019న ప్రారంభించారు.
జిల్లాలోని ప్రజలకు దూరప్రాంతాలకు వెళ్లకుండా పట్టణంలోనే సేవలు అందించేందుకు కార్యాలయం ప్రారంభించారు. కానీ అగ్నిప్రమాదంతో కార్యాలయంలోని కంప్యూటర్లు Computers, యుపిఎస్ బ్యాటరీలు, ప్రింటర్స్ printers, కుర్చీలు Furniture, పేపర్స్ తదితర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.వాచ్‌మెన్ అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. కార్యాలయంలోని అటుపక్క ఉన్న గదికి, ఇటుపక్క ఉన్న గదికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
అందులోని పైళ్లు భద్రంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే దరఖాస్తుదారులకు సంబంధించిన పాస్‌పోర్టు డాటా ఏమీ మిస్ కాలేదని చెబుతున్నారు. `మా వద్ద ఎవరి ఫైలు ఉంచుకోబోము.
అభ్యర్థి ఉండగానే వారి పాస్పోర్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసి అతిని ఫైల్ అప్పుడే తిరిగి ఇస్తాం. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సమాచారాన్ని హైదరాబాద్ కార్యాలయానికి పంపిస్తాం` అని అధికారులు తెలిపారు.
(రిపోర్టింగ్ మీసా భాస్కర్, నిజామాబాద్)