TS Inter : జూన్ 1 నుంచి ఇంటర్ కాలేజీలు రీ ఓపెన్.. అకడమిక్ క్యాలెండర్ విడుదల
Telangana Junior Colleges:ఇంటర్మీడియట్ తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. 2023 -24 విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ శనివారం విడుదల చేశారు.
Telangana Junior Colleges 2023: ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఇంటర్ బోర్డు. 2023 -24 విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ను ప్రకటించింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 1 నుంచి కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచే ఇంటర్ కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందని బోర్డు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు రెండు నెలల పాటు వేసవి సెలవులు అమల్లో ఉంటాయని వెల్లడించింది.జూనియర్ కాలేజీలు విధిగా సెలవులను పాటించాలని స్పష్టం చేసింది. మొత్తంగా 227 రోజులపాటు తరగతులు నిర్వహించేలా షెడ్యూల్‌ను విడుదల చేసింది ఇంటర్ బోర్డు.
జూన్ 1, 2024 పునఃప్రారంభం
అర్ధవార్షిక పరీక్షలు 20-11-2023 నుంచి 25-11-2023
ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 2024 ఫిబ్రవరి రెండో వారంలో
ఇంటర్ వార్షిక పరీక్షలు 2024 మార్చి మొదటి వారంలో
దసరా సెలవులు 19-10-2023 నుంచి 25-10- 2023
పునః ప్రారంభం 26 అక్టోబర్ 2023 నుంచి
సంక్రాతి సెలవులు 13-1-2024 నుంచి 16-1-2023
పునః ప్రారంభం 17 జనవరి 2024 నుంచి
వేసవి సెలవులు 1-4-2024 నుంచి 31-5-2024
మొత్తం పని దినాలు - 227
TS Inter Results 2023: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు పూర్తి అయ్యాయి. 9 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా...ఫలితాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇప్పటికే వాల్యూయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. గత వారంలోనే షురూ చేయగా.... సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఎంసెట్ తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా.... వీలైనంత త్వరగా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. అన్నీ కుదిరితే మే మొదటి వారంలోనే ఇంటర్ ఫలితాలను విడుదల చేసే దిశగా కసరత్తు చేస్తోంది.
ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. సెకండియర్ కు సంబంధించి పరీక్షలకు గాను మొత్తం 4,02,630 మంది హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 4,82,619 మంది ఉన్నారు. ఇక ఎంసెట్, నీట్, JEE తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపెర్ అయ్యే పనిలో పడ్డారు.