బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సమస్యతో బాధ పడుతున్న ఆయన.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు.
మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో పలు బాధ్యతలను నిర్వర్తించారు. టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు.
2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 20218, 2023 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.