Telangana CPM: తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శిగా జాన్‌ వెస్లీ, దళిత నాయకుడికి అవకాశం…-john wesley a dalit leader is appointed as telangana state cpm secretary ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Cpm: తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శిగా జాన్‌ వెస్లీ, దళిత నాయకుడికి అవకాశం…

Telangana CPM: తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శిగా జాన్‌ వెస్లీ, దళిత నాయకుడికి అవకాశం…

HT Telugu Desk HT Telugu
Jan 29, 2025 04:55 AM IST

Telangana CPM: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తొలిసారి దళిత నాయకుడు ఎన్నికయ్యాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన జాన్ వెస్లీ ని రాష్ట్ర కార్యదర్శి పదవికి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నుకుంది.

తెలంగాణ సీపీఎం కార్యదర్శిగా జాన్ వెస్లీ
తెలంగాణ సీపీఎం కార్యదర్శిగా జాన్ వెస్లీ

Telangana CPM: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 25 నుంచి 28 తారీకు వరకు తేదీల వరకు స్థానిక గోకుల్ గార్డెన్లో సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభలు జరిగాయి. మూడు రోజులపాటు జరిగిన మహాసభల్లో ప్రజా సమస్యలపై అనేక తీర్మానాలను ఆమోదించారు. ముగింపు రోజు పార్టీ నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌ వెస్లీ ఎన్నికయ్యారు.

yearly horoscope entry point

60 మంది రాష్ట్ర కమిటీ సభ్యులుగా 14 మంది రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్ కు చెందిన జాన్ వెస్లీ సిపిఐ ఎం పార్టీలో 30 ఏళ్లకు పైగా వివిధ బాధ్యతల్లో పనిచేస్తూ వచ్చారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా పనిచేసిన ఆయన సామాజిక న్యాయ సాధన కోసం సిపిఐ ఎం అనుబంధంగా ఉన్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు కుల వివక్షకు వ్యతిరేకంగా మిల్టెంట్ పోరాటాలు నిర్వహించి సామాజిక స్రవంతి ని ఐక్యం చేయడంలో ముఖ్య భూమిక వహించారు. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న జాన్ వెస్లీ సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర మహాసభలో ఏకగ్రీవంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

చారిత్రాత్మక ఎన్నిక…

ఆర్థిక దోపిడికి వ్యతిరేకంగా సామాజిక న్యాయ సాధన కోసం వర్గ ఉద్యమాలతో పాటు సామాజిక పోరాటాలు నడుపుతున్న సీపీఎ: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా దళితుడిని రాష్ట్ర కార్యదర్శిగా చేసి కొత్త చరిత్రను సృష్టించింది. నూతన కార్యదర్శిగా ఎన్నికైన జాన్ వెస్లీ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల్లో పలు అంశాలపై తీర్మానాలను ఆమోదించామన్నారు.

రైతాంగం ఎదుర్కొంటున్న కనీసం మద్దతు ధరల చట్టం సాధన తో పాటు భూనిర్వాసితులకు 2013 చట్టప్రకారం పరిహారం ఇవ్వాలని మహాసభ తీర్మానం చేసిందని ఆ సమస్యపై రైతన్నలను సమీకరించి పోరాటాలు చేపడతామన్నారు రాష్ట్రంలో కోటిన్నర కోటిన్నర మంది కార్మికులు కనీస వేతనాలకు నోచుకోకుండా దుర్భరమైన పరిస్థితిలో అనుభవిస్తున్న పరిస్థితి ఉందన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు సమరశీలంగా పోరాటాలు నడపాలని మహాసభ పిలుపునిచ్చిందన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు సొంత ఇల్లు లేదని వారంతా సిపిఐ నాయకత్వంలో గుడిసెలు వేసుకొని పోరాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు వారందరికీ ఉద్యమాలు చేపట్టేందుకు మహాసభ తీర్మానించిందన్నారు.

రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.....

సిపిఎం రాష్ట్ర మహాసభ లో నూతనంగా 60 మందితో కమిటీ ఏర్పడింది అందులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా టి.జ్యోతి , జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, చుక్కా రాములు, పోతినేని సుదర్శన్, టి సాగర్, ఎండి బాస్, మనులక్ష్మి, పాలడుగు భాస్కర్ బండా రవికుమార్, నున్న నాగేశ్వరరావు, ఎండి జాంగిర్, పి.ప్రభాకర్ ఎన్నికయ్యారు.

రిలీవ్ అయిన తమ్మినేని వీరభద్రం....

తెలంగాణ రాష్ట్రంలో మూడు పర్యాయాలు జరిగిన రాష్ట్ర మహాసభల్లో కార్యదర్శిగా ఎన్నికై కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసిన రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంగారెడ్డిలో జరిగిన మహాసభల్లో రిలీవ్ అయ్యారు. వయసు ఆరోగ్య రీత్యా రాష్ట్ర కమిటీ బాధ్యత నుంచి ఆయన రిలీవ్ అయ్యారు.

సీపీఎ: కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేసిన చెరుపల్లి సీతారాములు కూడా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా రిలీవయ్యారు. సుదీర్ఘకాలం రాష్ట్ర కార్యదర్శివర్గంలో పనిచేసిన డీజీ నర్సింగరావు సైతం సంగారెడ్డి మహాసభలో రిలీవ్ అయ్యారు.

Whats_app_banner