Job Mela: వివాహిత మహిళలకు గుడ్‌న్యూస్.. ఈనెల 20న జాబ్‌మేళా.. డోంట్ మిస్-job mela for married women in warangal on 20th of this month ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Job Mela: వివాహిత మహిళలకు గుడ్‌న్యూస్.. ఈనెల 20న జాబ్‌మేళా.. డోంట్ మిస్

Job Mela: వివాహిత మహిళలకు గుడ్‌న్యూస్.. ఈనెల 20న జాబ్‌మేళా.. డోంట్ మిస్

Basani Shiva Kumar HT Telugu
Aug 17, 2024 05:56 PM IST

Job Mela: పెళ్లైన మహిళలు చాలామంది జాబ్ కోసం ట్రై చేస్తుంటారు. కానీ అందరికీ జాబ్ దొరకదు. దీంతో నిరాశ చెందుతారు. ఇంట్లో ఆర్థిక కష్టాలు పెరగడంతో ఏదో ఒక పనికి వెళ్దామని ఫిక్స్ అవుతారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్.

వివాహిత మహిళలకు జాబ్ మేళా
వివాహిత మహిళలకు జాబ్ మేళా

ఈ నెల 20న (మంగళవారం) వివాహిత మహిళలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా ఉపాధి కల్పనాధికారి ఉమారాణి వివరాలు వెల్లడించారు. వరంగల్ రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ కంపెనీలో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయని ఉమారాణి వెల్లడించారు. మొత్తం 50 ఖాళీలు ఉండగా.. వరంగల్ నగరం ములుగు రోడ్డులోని ఐటీఐ ప్రాంగణంలో ఉద్యోగాల ఎంపీక ప్రక్రియ ఉంటుందని వివరించారు. డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ ఉద్యోగానికి అర్హులని చెప్పారు. ఏమైనా సందేహాలు ఉంటే.. 95735 85532 నంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకొవాలని సూచించారు.

ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 20న ములుగు రోడ్డులోని ఐటీఐ కాలేజీకి రావాలని ఉమారాణి సూచించారు. వచ్చేటప్పుడు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికేట్లు తీసుకురావాలని సూచించారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ప్రవేశాల ప్రకటన..

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్‌ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ నుంచి ప్రవేశాల ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో యూజీ/ పీజీ/ డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. యూజీ, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను పేర్కొంది. ఆన్ లైన్ దరఖాస్తులకు ఆగస్టు 31వ తేదీని తుది గడువుగా ఉంది.

ముఖ్య వివరాలు:

ప్రవేశాల ప్రకటన - స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్‌ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, కాకతీయ వర్శిటీ.

యూజీ కోర్సులు: బీకాం(జనరల్)/ బీకాం (కంప్యూటర్స్)/ బీబీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌)/ BLIsc (వ్యవధి: మూడేళ్లు.)

పీజీ కోర్సులు - ఎంఏ (ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్). (వ్యవధి: )రెండేళ్లు.

డిప్లొమా కోర్సులు: బిజినెస్ మేనేజ్‌మెంట్/ రిటైల్ మార్కెటింగ్/ ట్యాలీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్/ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్/ పీడీ అండ్‌ సి స్కిల్స్ (వ్యవధి: ఒక ఏడాది)

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2024.

యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం ఉంటుంది.

అధికారిక వెబ్ సైట్ - http://sdlceku.co.in/index.php

మెయిల్ - info@sdlceku.co.in