Jio 5g Services: వరంగల్, కరీంనగర్ నగరాల్లో రిల‌య‌న్స్ జియో ట్రూ 5జీ సేవ‌లు-jio launches true 5g services in warangal and karimnagar today
Telugu News  /  Telangana  /  Jio Launches True 5g Services In Warangal And Karimnagar Today
వరంగల్లు, కరీంనగర్ నగరాల్లో ప్రారంభమైన జియో 5జీ సేవలు
వరంగల్లు, కరీంనగర్ నగరాల్లో ప్రారంభమైన జియో 5జీ సేవలు

Jio 5g Services: వరంగల్, కరీంనగర్ నగరాల్లో రిల‌య‌న్స్ జియో ట్రూ 5జీ సేవ‌లు

10 January 2023, 16:52 ISTHT Telugu Desk
10 January 2023, 16:52 IST

Jio 5g Services: రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను తెలంగాణ లోని వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో మంగళవారం లాంఛనంగా ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్ లో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.

జియో ట్రూ 5జీ సేవల ప్రారంభంతో తెలంగాణ విస్తృత టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది.

జియో ట్రూ 5 జీ పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్ట‌చివ‌రి ప్రాంతం వరకు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ సందర్భంగా జియో తెలంగాణ సీఈఓ కే సీ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ లో జియో ట్రూ 5జీని విస్తరించడం పట్ల సంతోషంగా ఉంది. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ -5 జి ప్రయోజనాలను అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారు. అందువ‌ల్ల ఈ గ‌ణ‌నీయ‌మైన మార్పుకు ఉన్న శ‌క్తి, దాని అపార ప్ర‌యోజ‌నాల‌ను మ‌న దేశంలోని ప్ర‌తి పౌరుడికి అందుతుంది. తెలంగాణ‌ను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని అన్నారు.

జనవరి 10 నుంచి వరంగల్, కరీంనగర్‌లలో జియో వినియోగదారులకు జియో వెల్‌కమ్ ఆఫర్ వర్తిస్తుంది. దీనిద్వారా వారు అదనపు ఖర్చు లేకుండా 1 జీబీపీఎస్ + వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు.

వరంగల్, కరీంనగర్‌లతో పాటు దేశ వ్యాప్తంగా 4 రాష్ట్రాల లోని ఆరు నగరాలలో- అస్సాం (గౌహతి), కర్ణాటక (హుబ్లీ-ధార్వాడ్, మంగళూరు, బెల్గామ్), కేరళ (చేర్తాల), మహారాష్ట్ర (షోలాపూర్)- జియో ట్రూ 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 93 నగరాలలో జియో తన ట్రూ 5జీ సేవలు అందిస్తోంది.

సులభంగా అప్‌గ్రెడేషన్

జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 4జీ ఎల్‌టిఇ టెక్నాలజీతో ప్రపంచస్థాయి ఆల్-ఐపీ డేటా స్ట్రాంగ్ ఫ్యూచర్ ప్రూఫ్ నెట్ వర్క్ నిర్మించింది. సాంకేతికత 6 జి, అంతకు మించి ముందుకు సాగుతున్నందున మరింత డేటా వేగానికి మద్దతు ఇవ్వడానికి సులభంగా అప్ గ్రేడ్ చేయవచ్చు. ప్రతి ఒక్కరూ జియో డిజిటల్ జీవితాన్ని గడపడానికి నెట్ వర్క్, పరికరాలు, అప్ల‌కేష‌న్లు, కంటెంట్, సేవా అనుభవం, సరసమైన టారిఫ్ లతో కూడిన వ్యవస్థను సృష్టించినట్టు కంపెనీ తెలిపింది.

సంబంధిత కథనం