Jagtial News : కుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాల మహిళలు, ఎస్పీ చొరవతో ఆచూకీ లభ్యం-jagtial women missed in maha kumbh mela identified prayagraj police reached telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial News : కుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాల మహిళలు, ఎస్పీ చొరవతో ఆచూకీ లభ్యం

Jagtial News : కుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాల మహిళలు, ఎస్పీ చొరవతో ఆచూకీ లభ్యం

Bandaru Satyaprasad HT Telugu
Feb 01, 2025 11:47 PM IST

Jagtial News : ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వెళ్లి తప్పిపోయిన నలుగురు జగిత్యాల మహిళల ఆచూకీ లభించింది. జిల్లా ఎస్పీ ప్రయాగ్ రాజ్ పోలీసులను సంప్రదించి మహిళల ఆచూకీ కనుక్కున్నారు. వారిని ఇవాళ జగిత్యాలకు తీసుకొచ్చారు.

కుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాల మహిళలు, ఎస్పీ చొరవతో ఆచూకీ లభ్యం
కుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాల మహిళలు, ఎస్పీ చొరవతో ఆచూకీ లభ్యం

Jagtial News : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొనడానికి జగిత్యాల జిల్లాకు చెందిన 11 మంది మహిళలు ఈ నెల 27న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బయలుదేరారు. 29వ తేదీ సాయంత్రం వారు ప్రయాగ్ రాజ్ లోని సంఘం ఘాట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ గంగానదిలో పుణ్యస్నానం చేయడానికి రెండు గ్రూపులుగా విడిపోయి వెళ్లారు. ఈ క్రమంలో ఏనుగుల బుచ్చవ్వ, మరో ముగ్గురు మహిళలు బెల్లపు సత్తవ్వ, వీర్ల నరసవ్వ, ఆది రాజవ్వ జనసందోహంలో తప్పిపోయారు.

జిల్లాకు చెందిన 4 గురు మహిళలు తప్పిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ వెంటనే ఆ మహిళల వివరాలు తెలుసుకొని ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ పోలీసుల సహాయంతో నలుగురి మహిళల ఆచూకీ కనుక్కున్నారు. ఇవాళ ఉదయం వారిని జగిత్యాలకు తీసుకువచ్చారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని తప్పిపోయిన మహిళలను సురక్షితంగా తీసుకొచ్చిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, పోలీసులకు మహిళల కుటుంబాల సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Whats_app_banner