TGPSC Protest: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి జేఏసీ,పలువురు విద్యార్ధి నాయకుల అరెస్ట్
TGPSC Protest: డిమాండ్ల సాధన కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారి తీసింది.

TGPSC Protest: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడికి నిరుద్యోగ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతకు దారి తీసింది. కమిషన్ కార్యాలయం ముట్టడికి పలు విద్యార్ధి సంఘాలు ముట్టడించేందుకు పిలుపునిచ్చాయి. నిరుద్యోగ జేఏసీ ముట్టడిని అడ్డు కునేందుకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
నిరుద్యోగ జేఏసీతో పాటు పలు విద్యార్థి సంఘాలు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి శుక్రవారం ప్రయత్నించారు. దీంతో పోలీసులు పబ్లిక్ సర్వీస్‌కు వచ్చే మార్గాలను మూసివేశారు. సమీపంలో మెట్రో స్టేషన్ల వద్ద తనిఖీలు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకల్ని మళ్లించారు.
TGSPSC వద్ద భారీ కంచెలతో భద్రత ఏర్పాటు చేశారు. నిరుద్యోగులు TGSPSC ముట్టడి నేపథ్యంలో భారీ కంచెలతో భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు BRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,తుంగ బాలు ,స్వామి లతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్ధి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నిరుద్యోగుల జేఏసీ పిలుపుతో చలో టీజీపీఎస్సికి బీఆర్ఎస్వీ కూడా మద్దతు ప్రకటించింది. BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట పోలీసులు అడ్డుకోవడంతో సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు, విద్యార్థులు నినాదాలు చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని కోరినా పోలీసులు అందుకు అనుమతించలేదని విద్యార్ధులు ఆరోపించారు.
తెలంగాణలో వెంటనే గ్రూప్ 2,3 పోస్టుల భర్తీ చేయడం, డిఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేసి అక్టోబర్‌లో 25వేల పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహించడం, గ్రూప్ 1 కు 1:100లో ఎంపిక చేయడం వంటి డిమాండ్లతో విద్యార్ధులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
తెలంగాణలోని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌తో విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. బీజేవైఎం, టిజిఎస్వీతో పాటు పలు విద్యార్థి సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి.