IT Raids Mallareddy: మల్లారెడ్డికి IT నోటీసులు.. ఇప్పటివరకు ఏం జరిగిందంటే…-it raids complted at minister mallareddy house ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  It Raids Complted At Minister Mallareddy House

IT Raids Mallareddy: మల్లారెడ్డికి IT నోటీసులు.. ఇప్పటివరకు ఏం జరిగిందంటే…

HT Telugu Desk HT Telugu
Nov 24, 2022 10:35 AM IST

IT Raids Mallareddy Updates: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ శాఖ సోదాలు ముగిశాయి. రెండోరోజులుగా సాగిన ఐటీ సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మల్లారెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది.

మల్లారెడ్డి ఇంటిపై ముగిసిన ఐటీ సోదాలు
మల్లారెడ్డి ఇంటిపై ముగిసిన ఐటీ సోదాలు

IT Raids On Minister Mallareddy: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy)కి సంబంధించి.. రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి జరుగుతున్న సోదాలు... ఇవాళ ఉదయం ముగిశాయి.మంత్రి మల్లారెడ్డితోపాటుగా ఆయన కుమారులు, బంధువులు ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు ఏకధాటిగా తనిఖీలు జరిగాయి. మల్లారెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి ఇళ్లలోనూ విస్తృతంగా రైడ్స్ చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు

ఏకకాలంలో సోదాలు…

2 రోజులపాటూ.. 65 బృందాలుగా.. 400 మంది అధికారులు ఈ సోదాలు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు 10 కోట్ల 50 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఐటీ శాఖ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. రెండు సూట్‌ కేస్‌లు, 6 బ్యాగుల్లో వివిధ డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై మల్లారెడ్డికి నోటీసులు ఇచ్చిన అధికారులు... సోమవారం తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అటు టర్కీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి.. హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన ఇంట్లో రూ.2 కోట్లకు డబ్బు లభించినట్లు వార్తలు వచ్చాయి.మల్లారెడ్డి బంధువు రఘునందన్ ఇంట్లో రూ.2 కోట్లు, త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, సుధీర్ రెడ్డి ఇంట్లో రూ.2.5 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.1 కోటి సాధీనం చేసుకున్నారు.

మల్లారెడ్డి విద్యాసంస్థల్లో ఫీజు అధికంగా వసూలు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ మెుత్తం.. కూడా నగదుగానే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ డబ్బులు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు(Investments) పెట్టారని సమాచారం. రెండు రోజు సుమారుగా రూ.6 కోట్ల వరకూ నగదును స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తులు తక్కువ విలువకు చూపినట్టుగా అధికారులు ఆధారాలు సేకరించారు. దాదాపు ఇదంతా రూ.100 కోట్ల వ్యవహారం వరకు ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

అర్ధరాత్రి హైడ్రామా...

అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్ టాప్‌పై బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మొదట ఆసుపత్రిలో ఐటీ అధికారి రత్నాకర్‌ ల్యాప్‌టాప్‌ వదిలివెళ్లారు. రత్నాకర్‌ బోయిన్‌పల్లి పీఎస్‌కు మంత్రి మల్లారెడ్డి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో ఉండిపోయిన ల్యాప్‌టాప్‌ను మల్లా రెడ్డి అనుచరులు పీఎస్‌కు తీసుకుని వచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్‌ను కేంద్ర బలగాలు తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ల్యాప్‌టాప్‌ను లోపలికి తీసుకెళ్లేందుకు మల్లారెడ్డి అనుచరులు ప్రయత్నించారు. అడ్డుకున్న కేంద్ర బలగాలు.. ల్యాప్‌టాప్‌ను బయటే పెట్టించాయి. మంత్రిపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేసిన తర్వాత కేంద్ర బలగాలు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయాయి. ఆ తర్వాత ల్యాప్ టాప్ ను పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు.

మంత్రి ఫిర్యాదు…

ఐటీ అధికారులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి మల్లారెడ్డి. తాను లేని సమయంలో తన కుమారుడితో తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇప్పించి సంతకం చేయించుకున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై బోయినపల్లి పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు. హాస్పిటల్‌లో ఉన్న తన కొడుకుతో బలవంతంగా సంతకం చేపించుకుంటున్నారని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా కేంద్రంలోని బీజేపీ చేయిస్తోందని ఆరోపించారు. తాము ఏ అక్రమాలకూ పాల్పడలేదనీ.. అనుకున్నదానికంటే తక్కువగానే ఫీజులు తీసుకుంటున్నామనీ.. ఎంతో మందికి ఉచిత సేవలు అందిస్తున్నామని అన్నారు.

ఐటీ నోటీసులు అందుకున్న మల్లారెడ్డి సోమవారం జరిగే విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన్ను అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి.

IPL_Entry_Point