IT Raids in Telangana : తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు-it department raids congress candidate residence in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  It Raids In Telangana : తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు

IT Raids in Telangana : తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 02, 2023 01:57 PM IST

IT Raids in Telangana: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో ఐటీ అధికారులు సోదాలకు దిగారు. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతల ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడులను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

తెలంగాణలో ఐటీ సోదాలు
తెలంగాణలో ఐటీ సోదాలు

IT department raids in Telangana: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదిలా ఉంటే… తాజాగా ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్‌పేట్‌ మేయర్‌, కాంగ్రెస్‌ నేత చిగురింత పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో గురువారం ఉదయమే ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. పలు దస్త్రాలను పరిశీలించారు.

ఇక మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. ఏడు మందికిపైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా కోకాపేట పరిధిలోని ఈడెన్ గార్డెన్స్ లో కూడా తనిఖీలు చేపట్టారు. ఇది ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బంధువుది అని సమాచారం.

ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలపై ఈడీ దాడులు జరగటాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. బీజేపీ, బీఆర్ఎస్ డైరెక్షన్ లోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

దాదాపు 10 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ తనిఖీలు జరుగుతుండగా… ఇందులో ఒకరు బీఆర్ఎస్ నేత కూడా ఉన్నారు. ఇటీవలే బాలాపూర్ లడ్డూ కైవసం చేసుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు.

గతంలో కూడా తెలంగాణలో ఈడీ, ఐటీ సోదాలు విస్తృతంగా జరిగాయి. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలే టార్గెట్ జరగటం, విచారణకు కూడా హాజరైన సందర్భాలు ఉన్నాయి. ఈ దాడుల విషయంలో బీజేపీలోని తెగ టార్గెట్ చేసింది బీఆర్ఎస్. మధ్యలో తీవ్రత తగ్గినప్పటికీ… తీరా ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ సోదాలు జరగటం చర్చనీయాంశంగా మారింది. అయితే రానున్న రోజుల్లో మరిన్ని సోదాలు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Whats_app_banner