వేర్వేరు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా కరీంనగర్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'TIRUPATI FROM KARIMNAGAR' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్‌లో కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తి, తిరుమల, తిరుపతి ప్రాంతాలు కవర్ అవుతాయి.
ఈ ప్యాకేజీ జూన్ 19వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో చూడొచ్చు. కరీంనగర్ తో పాటు వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్ లో కూడా ప్రయాణికులు ట్రైన్ ఎక్కొచ్చు.
ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... సింగిల్ షేరింగ్ కు రూ. 14,030ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 10,940ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.9160గా ఉంది. కంఫ్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. స్టాండర్ట్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7250, డబుల్ షేరింగ్ కు రూ. 9030, సింగిల్ షేరింగ్ కు రూ. 12120గా నిర్ణయించారు.
ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి. ఏమైనా ఇబ్బందులు ఉంటే 9701360701 / 9281030712 నెంబర్లను సంప్రదింవచ్చు.