IRCTC Tour Packages 2025 : సమ్మర్ వేళ హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీలు - ఈ ఐదింటిపై ఓ లుక్కేయండి-irctc tourism to operate summer special tour packages from hyderabad 2025 know these details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Tour Packages 2025 : సమ్మర్ వేళ హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీలు - ఈ ఐదింటిపై ఓ లుక్కేయండి

IRCTC Tour Packages 2025 : సమ్మర్ వేళ హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీలు - ఈ ఐదింటిపై ఓ లుక్కేయండి

IRCTC Tour Packages from Hyderabad 2025 : సమ్మర్ వేళ చాలా మంది టూరిస్ట్ ప్లేసులను సందర్శిస్తుంటారు. అయితే హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే IRCTC టూరిజం పలు ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఇందులో కొన్ని అధ్యాత్మిక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ ప్యాకేజీలపై ఓ లుక్కేయండి….

సమ్మర్ వేళ స్పెషల్ టూర్ ప్యాకేజీలు (image source @IRCTCofficial)

సమ్మర్ వచ్చేయటంతో చాలా మంది టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లే ప్లాన్ లో ఉంటారు..! కొందరు కేరళ, గోవా వంటి ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే… మరికొందరు అధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తుంటారు. అయితే హైదరాబాద్ సిటీ నుంచి వెళ్లాలనుకునేవారికి IRCTC టూరిజం పలు ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. బడ్జెట్ ధరలోనే వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో కొన్ని ప్యాకేజీల వివరాలను ఇక్కడ చూడండి….

  1. కర్ణాటక టూర్ ప్యాకేజీ: కర్ణాటక తీర ప్రాంతంలోని పలు ప్రాంతాలను చూసేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ ను ఆపరేట్ చేయనుంది. మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి వంటి ఆలయాలను చూడొచ్చు. “COASTAL KARNATAKA” పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ట్రిప్ ఏప్రిల్ 1వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.
  2. కేరళ హిల్స్ అండ్ వాటర్స్ ప్యాకేజీ : హైదరాబాద్ నుంచి కేరళ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. అలెప్పీ, మున్నార్ సందర్శించుకోవాలని అనుకునేవారు ఈ ప్యాకేజీని ఎంచుకోవచ్చు. KERALA HILLS & WATERS పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఏప్రిల్ 1వ తేదీన అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఐఆర్ సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి బుక్ చేసుకోవచ్చు. 5 రాత్రులు, 6 రోజులు ఈ టూర్ ఉంటుంది.
  3. ఊటీ టూర్ ప్యాకేజీ : ఈ మండే వేసవిలో ఊటీలో ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్ నుంచి ‘ULTIMATE OOTY EX HYDERABAD ’పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా... ఊటీతో పాటు కున్నూర్ వంటి టూరిజం ప్రాంతాలను చూసి రావొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 1 ఏప్రిల్, 2025వ తేదీన అందుబాటులో ఉంది.
  4. వండర్స్ ఆఫ్ వయనాడ్ : కేరళ అందాలను మాటల్లో వర్ణించలేం. ఇక్కడ ఉండే ప్రకృతి అందాలను చూసి అస్వాదించాల్సిందే. అయితే వయనాడ్​లోని పలు ప్రదేశాలను చూసేందుకు IRCTC​ టూరిజం… హైదరాబాద్ సిటీ నుంచి ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. “WONDERS OF WAYANAD” పేరుతో ఆపరేట్ చేసే ఈ ట్రిప్… 6 రోజులు ఉంటుంది. ప్రస్తుతం ఈ ట్రిప్… ఏప్రిల్ 1వ తేదీని అందుబాటులో ఉంది.
  5. ఈస్ట్ కోస్ట్ టూర్ ప్యాకేజీ: ఈ ప్యాకేజీలో భాగంగా విశాఖతో పాటు అరకు అందాలను చూసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ… ఏప్రిల్ 3వ తేదీన అందుబాటులో ఉంది. IRCTC టూరిజం వెబ్ సైట్లోకి వెళ్లి “JEWEL OF EAST COAST” పేరుతో ఉండే ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

పైన పేర్కొన్న టూర్ ప్యాకేజీ ట్రైన్, బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. జర్నీ డేట్ కంటే ముందే టికెట్లను బుకింగ్ చేసుకోవాలి. ఇందులో పెద్దలకు, చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి. ఎంచుకునే బెర్త్ ను బట్టి ధరలను నిర్ణయించారు. ఆయా ప్యాకేజీల వివరాలతో పాటు బుకింగ్ కోసం IRCTC టూరిజం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.