తెలుగు న్యూస్ / తెలంగాణ /
IRCTC Tour Package 2025 : ఒకే ట్రిప్ లో ఓంకారేశ్వర్, ఉజ్జయిని దర్శనం - హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, వివరాలివే
IRCTC Hyderabad Jyotirlinga Tour : ఈ కొత్త సంవత్సరం వేళ ఐఆర్ సీటీసీ టూరిజం కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ కు టూర్ ఆపరేట్ చేయనుంది. ఇందులో భోపాల్, సాంచి, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ కవర్ అవుతాయి. జనవరి 8వ తేదీన జర్నీ ఉంది.
జ్యోతిర్లింగ దర్శనం టూర్ ప్యాకేజీ
శివుడు కొలువుదీరిన అనేక ప్రముఖ ఆలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాటిని దర్శించుకుంటే మంచిదని భక్తుల నమ్మకం. శివ జ్యోతిర్లింగాలు చాలా ఫేమస్. అత్యంత ప్రసిద్ధి చెందినవి. అక్కడకు వెళ్లడం అత్యంత పవిత్రమైనదని శివ భక్తులు భావిస్తారు. అయితే వారికోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ జనవరి నెలలోనే జర్నీ ఉంది.
- హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
- ‘MADHYA PRADESH JYOTIRLINGA DARSHAN’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
- ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూపించనుంది. భోపాల్, సాంచి, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ ప్రాంతాలు కవర్ అవుతాయి.
- ప్రస్తుతం ఈ టూర్ జనవరి 8, 2025వ తేదీన అందుబాటులో ఉంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా వెళ్లొచ్చు. టూరిజం వెబ్ సైట్ లో వివరాలు తెలుసుకోవచ్చు.
- మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. సాయంత్రం 04. 40 నిమిషాలకు (Sampark Kranti Express 12707) రైలు ప్రారంభంమవుతుంది.
- రెండో రోజు ఉదయం 08. 15 నిమిషాలకు భోపాల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. ఇక్కడ సాంచి స్తూపాన్ని దర్శించుకుంటారు. తిరిగి భోపాల్ కు చేరుకుంటారు. ఇక్కడ ట్రైబల్ మ్యూజియం, తాజ్ ఉల్ మసీద్ ను చూస్తారు. రాత్రి భోపాల్ లోనే బస చేస్తారు.
- మూడో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత ఉజ్జయినికి బయల్దేరుతారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రి ఉజ్జయినిలోనే బస చేస్తారు.
- నాల్గో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. మహేశ్వర్ కు వెళ్తారు. Ahilya దేవి ఫోర్ట్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత నర్మాదా ఘాట్ కు వెళ్తారు. అక్కడ్నుంచి ఓంకారేశ్వర్ కు చేరుకుంటారు. ఆలయాన్ని దర్శించుకుంటారు.
- 5వ రోజు ఇండోర్ కు చేరుకుంటారు. లాల్ బాగ్ ప్యాలెస్, Khajrana గణేశ్ మందిర్ ను దర్శించుకుంటారు. రాత్రి 8 గంటల వరకు ఇండోర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.
- Day 6- Monday: రాత్రి 10 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
- హైదరాబాద్ - మధ్యప్రదేశ్ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ. 36190 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 20360 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.15880గా ఉంది. కంఫర్ట్ కేటగిరిలోని AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13380గా నిర్ణయించారు.
- పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
- మధ్యప్రదేశ్ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR097
సంబంధిత కథనం