గోవా ట్రిప్ ప్లాన్ ఉందా....? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, ఆగస్టు నెలలో జర్నీ..!-irctc tourism to operate goa tour package in august 2025 from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  గోవా ట్రిప్ ప్లాన్ ఉందా....? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, ఆగస్టు నెలలో జర్నీ..!

గోవా ట్రిప్ ప్లాన్ ఉందా....? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, ఆగస్టు నెలలో జర్నీ..!

హైదరాబాద్ - గోవా టూర్ ప్యాకేజీ వచ్చేసింది. IRCTC టూరిజం ఈ ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం ట్రిప్ 4 రోజులు ఉంటుంది. ఆగస్టు నెలలో జర్నీ ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా నార్త్, సౌత్ గోవాలోని టూరిస్ట్ స్పాట్లను చూడొచ్చు. 13-AUG-25

goa tour package (image source pixabay)

గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? అయితే మీకోసం IRCTC టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. జూన్, జూలై మాసంలో కాకుండా… ఆగస్టు నెలలో ఆపరేట్ చేయనుంది. ఈ మేరకు ఐఆర్సీటీసీ టూరిజం వివరాలను ప్రకటించింది.

ఈ ప్యాకేజీ ఆగస్టు 13, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఇప్పట్నుంచే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే…. 'GOAN DELIGHT' పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ఉంటుంది.

4 రోజుల ట్రిప్ - షెడ్యూల్ వివరాలు…

మొత్తం నాలుగు రోజులు టూర్ ఉంటుంది. మొదటి రోజు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. నేరుగా గోవాకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ లోకి చెకిన్ అవుతారు. Zuari నది అందాలను వీక్షిస్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.

రెండో రోజు రోజు సౌత్ గోవాలో పర్యటిస్తారు. ఓల్డ్ గోవా చర్చిని చూస్తారు. ఇదే ప్రాంతంలో పురాతన మ్యూజియం ఉంటుంది. , వాక్స్ వరల్డ్ మ్యూజియం, మంగేషి ఆలయం, మీరామర్ బీచ్ వెళ్తారు. మండోవి నదిలో బోట్ క్రూజ్ జర్నీ ఉంటుంది. మూడో రోజు నార్త్ గోవా వెళ్తారు. ఇక్కడ ఉండే Aguada ఫోర్టు, కండోలియం బీచ్ సందర్శిస్తారు. ఇక బాగా బీచ్ లో నిర్వహించే….. స్పోర్ట్ ఈవెంట్స్ లో పాల్గొంటారు. అంజునా బీచ్, వగాటర్ బీట్, చాపోరా బీచ్ లను చూస్తారు. ఆ తర్వాత తిరిగి హోటల్ కి వెళ్తారు.

చివరి రోజు టిఫిన్ చేసిన తర్వాత.. హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. నేరుగా గోవా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హైదరాబాద్ కు చేరుకోవటంతో ట్రిప్ ముగుస్తుంది.

హైదరాబాద్ - గోవా ట్రిప్ ధరలు:

ఐర్సీటీసీ టూరిజం వివరాల ప్రకారం… సింగిల్ అక్యుపెన్సీకి రూ. 25, 210గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 19,420, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 18,860గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉన్నాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు.

ఎలా బుకింగ్ చేసుకోవాలి…?

హైదరాబాద్ - గోవా టూర్ ప్యాకేజీని IRCTC టూరిజం వెబ్ సైట్ ( https://www.irctctourism.com/ ) లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవాలి. ఏమైనా సందేహాలు ఉంటే 8287932228 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం