IRCTC Tour Package 2025 : ఒకే ట్రిప్ లో ఢిల్లీ, అగ్రా చూసి రావొచ్చు - ఈనెలలోనే హైదరాబాద్ నుంచి ట్రిప్, ప్యాకేజీ వివరాలు-irctc tourism to operate delhi and jaipur tour package from hyderabad on 15th januray 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Tour Package 2025 : ఒకే ట్రిప్ లో ఢిల్లీ, అగ్రా చూసి రావొచ్చు - ఈనెలలోనే హైదరాబాద్ నుంచి ట్రిప్, ప్యాకేజీ వివరాలు

IRCTC Tour Package 2025 : ఒకే ట్రిప్ లో ఢిల్లీ, అగ్రా చూసి రావొచ్చు - ఈనెలలోనే హైదరాబాద్ నుంచి ట్రిప్, ప్యాకేజీ వివరాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 05, 2025 02:05 PM IST

IRCTC Tour Package From Hyderabad 2025: న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూరిజం మరో ప్యాకేజీని ప్రకటించింది. గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ పేరుతో ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీలో… అగ్రా, ఢిల్లీ, జైపూర్ అందాలను చూసి రావొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…

గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ ప్యాకేజీ
గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ ప్యాకేజీ (image source istockphoto.com/)

వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు IRCTC టూరిజం కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అయితే ఈ న్యూ ఇయర్ వేళ మరో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీలో ఆగ్రా, ఢిల్లీ, జైపూర్ అందాలను చూసి రావొచ్చు.

yearly horoscope entry point

ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం జనవరి 15, 2025వ తేదీన అందుబాటులో ఉంది. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి 'GOLDEN TRIANGLE' ప్యాకేజీపై క్లిక్ చేసి తాజా అప్డేట్స్ తెలుసుకోవచ్చు.

ముఖ్య వివరాలు - టూర్ షెడ్యూల్

  • హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు.
  • మొదటి రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ స్టేషన్ నుంచి (Train No. 12723) రైలు బయల్దేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
  • రెండో ఉదయం 07.40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... కుతుబ్ మినార్ కు వెళ్తారు. లోటస్ టెంపుల్, అక్షరదామం సందర్శిస్తారు. రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు.
  • మూడో రోజు రెడ్ ఫోర్ట్, రాజ్ ఘాట్, తీన్ మార్తీభవన్, ఇండియా గేట్ చూస్తారు. రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు.
  • నాల్గోరోజు జైపూర్ కు వెళ్తారు. హోటల్ కి వెళ్లిన తర్వాత హవా మహాల్ సందర్శిస్తారు. రాత్రి జైపూర్ లోనే బస చేస్తారు.
  • అమీర్ ఫోర్ట్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్ ను సందర్శిస్తారు.
  • ఆరో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత అగ్రాకు వెళ్తారు. మార్గమధ్యలో ఫతేపుర్ సిక్రీకి వెళ్తారు. రాత్రి ఆగ్రాలోనే బస చేస్తారు.
  • ఏడో రోజు ఉదయం తాజ్ మహాల్ ను సందర్శిస్తారు. అగ్రా ఫోర్ట్ కు వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు అగ్రా రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. రాత్రంతా జర్నీలో ఉంటారు.
  • ఎనిమిదో రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో ఈ ప్యాకేజీ ముగుస్తుంది.
  • గోల్డెన్ టూర్ ప్యాకేజీ ధరలు : కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ షేరింగ్ కు రూ. 58340 ధర ఉండగా... డబుల్ షేరింగ్ కు రూ.32640, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 25420 గా ఉండాలి. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి.
  • ఇదే ప్యాకేజీని స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే సింగిల్ అక్యుపెన్సీకి రూ.55290, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 29590, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.22370గా నిర్ణయించారు.
  • టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ - https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR044

Whats_app_banner

సంబంధిత కథనం