IRCTC Andaman Tour : హైదరాబాద్ - అండమాన్ ట్రిప్.. తక్కువ ధరలోనే అదిరిపోయే 6 రోజుల ప్యాకేజ్! -irctc tourism latest andaman tour package from hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Latest Andaman Tour Package From Hyderabad City

IRCTC Andaman Tour : హైదరాబాద్ - అండమాన్ ట్రిప్.. తక్కువ ధరలోనే అదిరిపోయే 6 రోజుల ప్యాకేజ్!

HT Telugu Desk HT Telugu
Apr 15, 2023 01:11 PM IST

IRCTC Tour Package : అండమాన్ దీవుల్లోకి వెళ్లాలనిపిస్తుందా? సుమారు 300 ద్వీపాలు, అందమైన బీచ్‌లతో ఆకట్టుకునేలా ఉండే ఈ దీవులు ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిని చూడాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూర్ సరికొత్త ప్యాకేజీ అందిస్తోంది. డేట్స్ తో పాటు ధరలను పేర్కొంది.

 అండమాన్
అండమాన్ (facebook)

IRCTC Hyderabad To Andaman Tour : దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఇందులో భాగంగానే అండమాన్ దీవులను చూడాలనుకునే వారి కోసం ఓ ప్యాకేజీ ప్రకటించింది. తెల్లని ఇసుక తిన్నెలతో ఆహ్లాదకరంగా కనిపించే బీచ్‌లు చూడాలనుకుంటే తప్పకుండా ఈ దీవులకు వెళ్లాల్సిందే. అలాంటి వారికోసం ఐఆర్‌సీటీసీ… AMAZING ANDAMAN EX HYDERABAD పేరుతో ప్యాకేజీ అందిస్తోంది. 5 రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. HAVELOCK, PORT BLAIR, వివిధ ప్రాంతాలు కవర్ అవుతాయి. ఫ్లైట్లో తీసుకెళ్తారు. ప్రస్తుతం ఈ టూర్ మే 26వ తేదీన అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

షెడ్యూల్ చూస్తే....

Day 1:- హైదరాబాద్ - పోర్ట్ బ్లెయిర్

హైదరాబాద్ విమానాశ్రయం ఉదయం 04.35 గంటలకు బయల్దేరుతారు. 09.15 గంటల వరకు పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సెల్యూలార్ జైల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. లైట్, సౌండ్ షో చూడొచ్చు. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రి భోజనం, బస ఉంటుంది.

Day 2:- Port Blair – Havelock Island

రెండో రోజు హావ్‌లాక్ కు వెళ్తారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత... రాధానగర్ బీచ్ చూస్తారు. రాత్రి హావ్‌లాక్ లోనే బస చేస్తారు.

Day 3:- Havelock Island - Neil Island

హోటల్ లో అల్పాహారం చేసి.. చెక్ అవుట్ చేయాలి. తర్వాత కాలాపత్తర్ బీచ్ సందర్శిస్తారు. నీల్ ద్వీపం కోసం ప్రీమియం క్రూయిజ్ ఎక్కాలి. అక్కడకు చేరుకున్న తర్వాత హోటల్‌కు వెళ్లి చెక్ ఇన్ చేయాలి. రిఫ్రెష్ అయిన తర్వాత సహజ వంతెన, లక్ష్మణపూర్ బీచ్ సందర్శన ఉంటుంది. నీల్ ద్వీపంలోనే రాత్రి డిన్నర్, బస ఉంటుంది.

Day 4:- Neil Island - Port Blair

ఉదయాన్నే భరత్‌పూర్ బీచ్‌లో సూర్యోదయాన్ని ఆస్వాదించొచ్చు. అల్పాహారం ముగించుకుని హోటల్ నుండి చెక్ అవుట్ చేయాలి. క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరాలి. విశ్రాంతి, షాపింగ్ కోసం టైమ్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రి భోజనం, బస ఏర్పాటు చేస్తారు.

Day 5:- Ross & North Bay Island Tour

హోటల్ లో అల్పాహారం చేసి.. రాస్ ఐలాండ్ బయలుదేరుతారు. తర్వాత నార్త్ బే సందర్శన ఉంటుంది. భోజనం తర్వాత నేవల్ మెరైన్ మ్యూజియం సందర్శిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.రాత్రి ఫోర్ట్ బ్లెయిర్ లోనే బస చేస్తారు.

Day 6: Departure from Port Blair

హోటల్ లో అల్పాహారం చేసి చెక్అవుట్ చేయాలి. 07:55 గంటలకు హైదరాబాద్ వెళ్లే విమానం ఉంటుంది. 12:10 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ రేట్లు….

అండమాన్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే….. సింగిల్ ఆక్యూపెన్సీ కోసం ధర రూ.55,780గా ఉంది. డబూల్ ఆక్యుపెన్సీకి రూ.43,170 కాగా, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.42,885గా నిర్ణయించారు. హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఈ కింది జాబితాలో చెక్ చేసుకోవచ్చు.

అండమాన్ టూర్ ప్యాకేజ్ ధరల వివరాలు
అండమాన్ టూర్ ప్యాకేజ్ ధరల వివరాలు (www.irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి టూర్ ప్యాకేజీ బుకింగ్ తో పాటు ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.

IPL_Entry_Point