IRCTC Shirdi Tour 2025 : న్యూ ఇయర్ వేళ 'షిర్డీ సాయి' దర్శనం - తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు
IRCTC Hyderabad Shirdi Tour 2025 : న్యూ ఇయర్ వేళ షిర్డీ సాయి దర్శనం కోసం టూర్ ప్యాకేజీ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి IRCTC టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. జనవరి 01, 2025వ తేదీన ట్రైన్ జర్నీ ద్వారా షిర్డీకి వెళ్తారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి…..
షిర్డీకి సరికొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. అది కూడా కొత్త సంవత్సరం వేళ…! అతి తక్కువ ధరలోనే మీ ఫ్యామిలీతో కలిసే వెళ్లేలా IRCTC టూరిజం ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వెళ్తారు. ఈ ప్యాకేజీ లో లంచ్, డిన్నర్, ఎంట్రెన్స్ టికెట్స్, టూర్ గైడ్ వంటివి కల్పిస్తారు. ఏదైనా వ్యక్తిగత ఖర్చులు ఉంటే వెచ్చించాలి. కింద ఇచ్చిన పీడీఎఫ్ లో పూర్తి వివరాలు చూడొచ్చు.
- IRCTC టూరిజం వివరాల ప్రకారం.. ఈ టూర్ ప్యాకేజీ జనవరి 01, 2025వ తేదీన అందుబాటులో ఉంది.
- టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే ‘SAI SANNIDHI EX HYDERABAD’ పేరుతో ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది.
- ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీలో షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండేలా ఐఆర్‌సీటీసీ టూరిజం ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఇచ్చిన తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.
టూర్ షెడ్యూల్ ఇలా ఉంటుంది…
ఫస్ట్ డే హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్లో జర్నీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 06.40 గంటలకు రైలు(ట్రైన్ నెంబర్ - 17064) ఉంటుంది. నైట్ అంతా ప్రయాణం చేయాలి.
రెండో రోజు ఉదయం 07.10 గంటలకు నాగర్‌సోల్ వెళ్తుంది. ఆ తర్వాత షిరిడీకి వెళ్లాలి. హోటల్ వెళ్లిన తర్వాత.. షిరిడీ ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 05 గంటలకు రూమ్ చెకౌట్ చేయాలి. రాత్రి 08. 30 గంటల వరకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. మూడో రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు:
హైదరాబాద్ - షిర్టీ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 8790గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 7110,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6940గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5,260, డబుల్ షేరింగ్ కు రూ. 5430గా నిర్ణయించారు. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 7120గా ఉంది.
ఎలా బుక్ చేసుకోవాలంటే…
ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలంటే https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ప్యాకేజీల ఆప్షన్ పై నొక్కితే చాలా టూర్ ప్యాకేజీలు కనిపిస్తాయి. ఇందులో ‘SAI SANNIDHI EX HYDERABAD’ పేరుతో ఉండే ప్యాకేజీపై క్లిక్ చేయాలి. మీకు పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఇక్కడే బుకింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది.