Madhyapradesh Jyotirlinga Tour Package: పలు అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలని అనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు ట్రిప్ ప్యాకేజీని ప్రకటించింది. MADHYA PRADESH JYOTIRLINGA DARSHAN పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, భోపాల్, సాంచితో పాటు ప్రాంతాలు కవర్ అవుతాయి.,5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 8వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. షెడ్యూల్ చూస్తే....,Day 1- Wednesday: ప్రయాణికులు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. సాయంత్రం 04. 40 నిమిషాలకు (Sampark Kranti Express) రైలు ప్రారంభంమవుతుంది.,Day 2- Thursday: ఉదయం 08. 15 నిమిషాలకు భోపాల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. ఇక్కడ సాంచి స్తూపాన్ని దర్శించుకుంటారు. తిరిగి భోపాల్ కు చేరుకుంటారు. ఇక్కడ ట్రైబల్ మ్యూజియం, తాజ్ ఉల్ మసీద్ ను చూస్తారు. రాత్రి భోపాల్ లోనే బస చేస్తారు.,Day 3- Friday: హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత ఉజ్జయినికి బయల్దేరుతారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రి ఉజ్జయినిలోనే బస చేస్తారు.,Day 4- Saturday: నాల్గోరోజు ఓంకారేశ్వర్ కు చేరుకుంటారు. స్థానికంగా ఉన్న పలు పర్యాటక ప్రాంతాలను చూస్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.,Day 5- Sunday: ఐదోరోజు మహేశ్వర్ కు బయల్దేరారు. ఐలాదేవి ఫోర్టును సందర్శిస్తారు. అనంతరం మండు ఫోర్టు చూసిన తర్వాత ఇండోర్ కు బయల్దేరుతారు. అంబేడ్కర్ రైల్వే స్టేషన్ కు చేరుకొని రాత్రి 7 గంటలకు రైలు ఎక్కుతారు.,Day 6- Monday: రాత్రి 10 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.,టికెట్ రేట్లు ఇవే...ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... సింగిల్ షేరింగ్ కు రూ. 32,080 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18230 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14300 గా ఉంది. 3 Tier AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. చిన్న పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు.,,NOTE:ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.