IRCTC Tour From Hyd: హైదరాబాద్ - షిర్డీ ట్రిప్…. ఐఆర్‌సీటీసీ తాజా ప్యాకేజీ ఇదే-irctc tourism announced shirdi tour from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Shirdi Tour From Hyderabad

IRCTC Tour From Hyd: హైదరాబాద్ - షిర్డీ ట్రిప్…. ఐఆర్‌సీటీసీ తాజా ప్యాకేజీ ఇదే

HT Telugu Desk HT Telugu
Sep 30, 2022 04:21 PM IST

hyderabad shirdi tour package: హైదరాబాద్ నుంచి షిరిడీకి టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

హైదరాబాద్ షిర్డీ టూర్ ప్యాకేజీ,
హైదరాబాద్ షిర్డీ టూర్ ప్యాకేజీ, (/www.irctctourism.com)

Shirdi Shani Shingnapur Tour From Hyd: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా షిరిడీ సాయిబాబా భక్తుల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

hyderabad shirdi: అక్టోబర్ 5 వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 01 Wednesday: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 06.50 నిమిషాలకు బయల్దేరుతారు. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 02 Thursday: ఉదయం 07.10 నిమిషాలకు నాగర్ సోల్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి షిర్డీకి వెళ్తారు. హెటల్ లోకి చెకిన్ అవుతారు. అనంతరం షిర్డీ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఆ తర్వాత శని శిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంటి నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు బయల్దేరుతారు. రాత్రి 08 .30 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 03 Friday: ఉదయం 08.50 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరలివే....

సింగిల్ షేరింగ్ కు 10,200 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 6530 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 5400 గా నిర్ణయించారు. కంఫార్ట్ క్లాస్ల్ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం ధరల పట్టికను చూడండి....

<p>ధరల వివరాల జాబితా</p>
ధరల వివరాల జాబితా (www.irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

WhatsApp channel