IRCTC Poorva Sandhy Tour: IRCTC సరికొత్త ప్యాకేజీ.. ఈ ఆలయాలకు వెళ్లి రావొచ్చు-irctc tourism announced poorva sandhy tour package from hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Poorva Sandhy Tour Package From Hyderabad City

IRCTC Poorva Sandhy Tour: IRCTC సరికొత్త ప్యాకేజీ.. ఈ ఆలయాలకు వెళ్లి రావొచ్చు

HT Telugu Desk HT Telugu
Jan 20, 2023 08:27 AM IST

IRCTC Poorva Sandhya Tour: ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీని ప్రకటించింది. పూర్వ సంధ్య పేరుతో టూర్ అందుబాటులో ఉంది. శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి,తిరుచానూర్, తిరుమల వెళ్లాలనుకునే వారి కోసం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

పూర్వ సంధ్య టూర్
పూర్వ సంధ్య టూర్ (www.irctctourism.com)

IRCTC Tourism Latest Packages: తిరుపతితోపాటుగా చుట్టు పక్కల ఆలయాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్(Hyderabad) నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. 'పూర్వ సంధ్య'(Poorva Sandhya) పేరుతో టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు తిరిగిరావొచ్చు.

ట్రెండింగ్ వార్తలు

సికింద్రాబాద్ నుంచి టూర్ ప్రారంభవుతుంది. మూడు రాత్రులు, నాలుగు రోజుల ప్యాకేజీ ఇదీ. ప్రస్తుతం ఈ టూర్ జనవరి 28వ తేదీన అందుబాటులో ఉంది. షెడ్యూల్ చూస్తే...

Day - 1 : లింగంపల్లి(Lingampally) నుండి సాయంత్రం 05:25 గంటలకు రైలు బయలుదేరుతుంది. సికింద్రాబాద్ 06:10 గంటలకు చేరుకుంటుంది. నల్గొండ నుంచి 07:38 గంటల నుంచి బయలుదేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.

Day - 2: తిరుపతికి ఉదయం 05:55 గంటలకు చేరుకుంటారు. పికప్ చేసుకుని.. హోటల్‌కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలకు వెళ్లాలి. తర్వాత శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాన్ని సందర్శించాలి. తర్వాత హోటల్‌కి తిరిగి వెళ్తారు. రాత్రి తిరుపతిలో బస చేస్తారు.

Day - 3 : టిఫిన్స్ తర్వాత హోటల్‌(Hotel) నుంచి చెక్ అవుట్ అవ్వాలి. వేంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 08:30 గంటలకు తిరుమలకు బయలుదేరాలి. . సాయంత్ర 06:25 గంటలకు రైలు ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్‌(Tirupati Railway Station) నుంచి బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.

Day - 4 : నల్గొండ(Nalgonda)కు 03:04 గంటలకు చేరుకుంటారు. సికింద్రాబాద్‌కు 05:35 గంటలకు, లింగంపల్లికి 06:55 గంటలకు వస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ రేట్లు ఇవే...

ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 7720 గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ. 5860, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.5,660గా నిర్ణయించారు. కంఫర్ట్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీ ధర రూ.9570, డబుల్ ఆక్యూపెన్సీ రూ. 7720, ట్రిపుల్ ఆక్యూపెన్సీ రూ.7510గా నిర్ధారించారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లల కోసం వేర్వురు ధరలు ఉన్నాయి. కింద ఇచ్చిన జాబితాలో వివరాలు చెక్ చేసుకోవచ్చు.

టికెట్ల ధరల వివరాలు
టికెట్ల ధరల వివరాలు (www.irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీని బుక్ చేసకోవటంతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

IPL_Entry_Point