IRCTC Hyd - Ooty Tour: 10 వేల ధరలో ఊటీ ట్రిప్ - ఈ సరికొత్త ప్యాకేజీ చూడండి…-irctc tourism announced ooty and coonoor tour from hyderabad
Telugu News  /  Telangana  /  Irctc Tourism Announced Ooty And Coonoor Tour From Hyderabad
హైదరాబాద్ - ఊటీ టూర్
హైదరాబాద్ - ఊటీ టూర్ (facebook)

IRCTC Hyd - Ooty Tour: 10 వేల ధరలో ఊటీ ట్రిప్ - ఈ సరికొత్త ప్యాకేజీ చూడండి…

10 February 2023, 10:54 ISTHT Telugu Desk
10 February 2023, 10:54 IST

IRCTC Ooty Tour Package : ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ఆఫర్ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఊటీకి సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

IRCTC Tourism Tirupati Ooty Package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి.

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఊటీతో పాటుగా కూనూర్‌లోని పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ఫిబ్రవరి 14వ తేదీన అందుబాటులో ఉంది. షెడ్యూల్ చూస్తే...

Day 1 : ఊటీ టూర్ ప్యాకేజీ(Ooty Tour Package) మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఉంటుంది. రాత్రి అంతా జర్నీ చేయాలి.

Day 2 : రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్(Railway Station) కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అవ్వాలి. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపిస్తారు. రాత్రి భోజనం చేసి ఊటీలో బస చేయాలి.

Day 3 : మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం(Tea Museum), పైకారా ఫాల్స్ సందర్శనకు వెళ్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి.

Day 4 : నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే భోజనం చేసి బస చేయాలి.

Day 5 : ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు పర్యాటకులను తీసుకెళ్తతారు. మధ్యాహ్నం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి.

Day 6 : ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ రేట్లు ఇవే..

ఊటీ టూర్ ప్యాకేజీ(Ooty Tour Package) ధర చూసుకుంటే.. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.10,370, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.13,360గా ఉంది. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.12,830, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,820, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.27,700గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. పూర్తిగా ధరల వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.

టికెట్ రేట్ల వివరాలు
టికెట్ రేట్ల వివరాలు (/www.irctctourism.com/)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

సంబంధిత కథనం