IRCTC Ellora Tour: 'ఎల్లోరా కేవ్స్' చూడాలనుకుంటున్నారా..? మీకోసమే ఈ సరికొత్త ప్యాకేజీ -irctc tourism announced majestic maharashtra tour from hyderabad check full details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Majestic Maharashtra Tour From Hyderabad Check Full Details

IRCTC Ellora Tour: 'ఎల్లోరా కేవ్స్' చూడాలనుకుంటున్నారా..? మీకోసమే ఈ సరికొత్త ప్యాకేజీ

Mahendra Maheshwaram HT Telugu
Mar 03, 2023 05:00 AM IST

Ajanta Ellora Tour Packages from Hyderabad: అజంతా ఎల్లోరా అందాలను చూడాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులో తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ప్యాకేజీలో భాగంగా చూసే ప్రాంతాలు, డేట్స్ తో పాటు ధరల వివరాలను పేర్కొంది.

ఎల్లోరా గుహలు
ఎల్లోరా గుహలు (facebook)

IRCTC Tourism Packages From Hyderabad: సమ్మర్ వచ్చేసింది...! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం చూస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా ఎల్లోరా అందాలతో పాటు షిర్డీ, నాసిక్ ప్రాంతాలను చూసేలా సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. "MAJESTIC MAHARASHTRA EX HYDERABAD (SHA45)" పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా సాగే ఈ ట్రిప్ లో పలు ప్రాంతాలను చూపిస్తారు. నాలుగు రోజులు, 3 రాత్రులతో కూడిన ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ ట్రిప్... ఏప్రిల్ 6వ తేదీన అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ఔరంగాబాద్, ఎల్లోరా, నాసిక్, షిర్డీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. షెడ్యూల్ చూస్తే......

Day 1: హైదరాబాద్ - షిర్డీ

హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం బయల్దేరి షిర్డీకి చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ కు వెళ్తారు. సాయంత్రం షిర్డీ సాయిబాబాను దర్శించుకుంటారు. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.

Day 2: షిర్డీ - నాసిక్

బ్రేక్ ఫాస్ట్ తర్వాత... నాసిక్ వెళ్తారు. అక్కడ త్రయంబకేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం పంచావతికి వెళ్తారు. సాయంత్రం తిరిగి షిర్డీకి వస్తారు. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.

Day 3: షిర్డీ - ఎల్లోరా - ఔరంగాబాద్

అల్పాహారం తర్వాత శనిశిగ్నాపూర్ కు చేరుకుంటారు. ఆలయ దర్శనం తర్వాత... ఎల్లోరాకు వెళ్తారు. అద్బుతమైన ఎల్లోరా గుహలను చూస్తారు. గ్రిష్నేశ్వర్ ఆలయ దర్శనం ఉంటుంది. అక్కడ్నుంచి ఔరంగాబాద్ బయల్దేరుతారు. రాత్రి ఔరంగాబాద్ లోనే బస చేస్తారు.

Day 4: ఔరంగాబాద్ - హైదరాబాద్

బ్రేక్ ఫాస్ట్ తర్వాత... Bibi-ka-Maqbara కు వెళ్తారు. లంచ్ తర్వాత... మధ్యాహ్నం 02.30 గంటలకు ఔరంగాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తారు. అక్కడ్నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం ఉంటుంది. దీంతో ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ రేట్లు....

టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.... సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 25800 ఉండగా.. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 21,400గా నిర్ణయించారు. ఇక ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 20,900గా ఉంది. ఈ ధరలు కంఫర్ట్ క్లాస్ లో అందుబాటులో ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. కింద ఇచ్చిన జాబితాలో వివరాలు చెక్ చేసుకోవచ్చు.

టికెట్ ధరలు
టికెట్ ధరలు (www.irctctourism.com)

NOTE

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం