IRCTC Shirdi Tour: షిర్డీ టూర్... 3 వేల ధరలో 3 రోజుల ట్రిప్... ఈ IRCTC తాజా ప్యాకేజీ చూడండి-irctc tourism announced latest shirdi tour package from hyderabad ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Irctc Tourism Announced Latest Shirdi Tour Package From Hyderabad

IRCTC Shirdi Tour: షిర్డీ టూర్... 3 వేల ధరలో 3 రోజుల ట్రిప్... ఈ IRCTC తాజా ప్యాకేజీ చూడండి

షిర్డీ టూర్ ప్యాకేజీ
షిర్డీ టూర్ ప్యాకేజీ

Hyderabad -Shirdi Tour Package: షిరిడీకి సరికొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన తేదీలతో పాటు వివరాలను పేర్కొంది…

IRCTC Tourism Shirdi Tour From Hyderabad: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా షిర్డీ సాయిబాబా భక్తుల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ మే 17వ తేదీన అందుబాటులో ఉంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. షెడ్యూల్ చూస్తే….

ట్రెండింగ్ వార్తలు

Day 01 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 06.50 నిమిషాలకు బయల్దేరుతారు. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 02 : ఉదయం 07.10 నిమిషాలకు నాగర్ సోల్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి షిర్డీకి వెళ్తారు. హెటల్ లోకి చెకిన్ అవుతారు. అనంతరం షిర్డీ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఆ తర్వాత శని శిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంటి నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు బయల్దేరుతారు. రాత్రి 08 .30 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 03 : ఉదయం 08.50 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ల ధరల వివరాలు:

షిర్డీ టూర్ టికెట్ రేట్లు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు 12,100 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 6530 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 5400 గా నిర్ణయించారు. కంఫార్ట్ క్లాస్ల్ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఇక స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే సింగిల్ షేరింగ్ కు రూ. 8510, డబుల్ షేరింగ్ కు 4840గా నిర్ణయించారు. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన జాబితాను చూడండి.ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు
షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు

సంబంధిత కథనం