IRCTC Tourism Magical Kerala Tour: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కేరళలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. “MAGICAL KERALA” పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. అలెప్పీ, కొచ్చి, మున్నార్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.,5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ జనవరి 17వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు.,Day 01: తొలిరోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్రిప్ ప్రారంభమవుతుంది. (Train No.17230, Sabari Express) రైలు ఎక్కుతారు. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.,Day 02 : రెండో రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకులం రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి హెటల్ కి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం కొచ్చి ఫోర్టును సందర్శిస్తారు. రాత్రి కొచ్చిలోనే బస చేస్తారు.,Day 03: ఉదయం మున్నార్ కు వెళ్తారు. హెటల్ కి చెకిన్ అయిన తర్వాత... మెట్టుపెట్టి డామ్ ను సందర్శిస్తారు. రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.,Day 04 : ఎరవికులం జాతీయ పార్క్ ను సందర్శిస్తారు. ఇక్కడ్నుంచి అలెప్పీకి బయల్దేరుతారు. అనంతరం బోటింగ్ ఉంటుంది. సాయంత్రం అలెప్పీ బీచ్ కు వెళ్తారు. హెటల్ లో చెకిన్ అయిన తర్వాత.... రాత్రి అలెప్పీలోనే బస చేయాల్సి ఉంటుంది.,Day 05: ఐదో రోజు హెటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడ్నుంచి ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. ఉదయం 11.20 గంటలకు శబరి ఎక్సె ప్రెస్ లో హైదరాబాద్ కు బయల్దేరుతారు.,Day 06 Sunday: మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.,టికెట్ రేట్లు ఇవే...సింగిల్ షేరింగ్ కు రూ. 30,690 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 17,660 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14,450 గా ఉంది. ఈ రేట్లు కంఫర్ట్ (3A)కేటగిరీలో ఉంటాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. 5 - 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి.,,NOTE:ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.