IRCTC Hyd - Gwalior Tour: రాజసం ఉట్టిపడే గ్వాలియర్ కోటను చూస్తారా? మీ కోసమే ఈ ప్యాకేజీ
Hyd Madhya Pradesh Tour: గ్వాలియర్ ఫోర్ట్ అందాలను చూడాలని అనుకుంటున్నారా..? మీకోసం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.
IRCTC Tourism Updates: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి గ్వాలియర్ ఫోర్ట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'HERITAGE OF MADHYA PRADESH ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో గ్వాలియర్, ఖజురహోతో పాటు పలు ప్రాంతాలను చూపిస్తారు.
ట్రెండింగ్ వార్తలు
hyderabad madhya pradesh tour: ప్రస్తుతం ఈ టూర్ జనవరి 6వ తేదీన అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
Day 1- Friday: సాయంత్రం 4.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరుతారు. రాత్రి అంతా జర్నీ ఉంటుంది.
Day 2- Saturday: మధ్యాహ్నం 01.30 గంటలకు గ్వాలియర్ కు చేరుకుంటారు. యోగిని ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం హెటల్ లోకి చెకిన్ అవుతారు. రాత్రి గ్వాలియర్ లోనే ఉంటారు.
Day 3- Sunday: ఉదయమే గ్వాలియర్ ఫోర్ట్ ను సందర్శిస్తారు. హోటల్ నుంచి 10 గంటలకు చెక్ అవుట్ అవుతారు. అనంతరం జై విలాస్ ప్యాలెస్ ను సందర్శిస్తారు. అక్కడ్నుంచి ఓర్చాకు వెళ్తారు. ఓర్చా ఫోర్ట్ ను సందర్శించిన తర్వాత.. ఖజరహో కు బయల్దేరుతారు. రాత్రి ఖజరహోలోనే బస చేస్తారు.
Day 4- Monday: ఖజరహోలో స్థానికంగా ఉన్న ఆలయాలను దర్శించుకుంటారు. సాయంత్రం లైటింగ్ అండ్ సౌండ్ షోను చూస్తారు. రాత్రికి ఖజరహోలోనే స్టే చేస్తారు.
Day 5- Tuesday: హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత...రానేశ్ వాటర్ ఫాల్స్ చూస్తారు. సాయంత్రం సత్నాకు బయల్దేరుతారు. రైల్వే స్టేషన్ నుంచి 11.25 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి అంతా జర్నీలోనే ఉంటారు.
Day 6- Wednesday: రాత్రి 09.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టికెట్ రేట్లు…
hyd madhyapradesh tour rates: సింగిల్ షేరింగ్ కు రూ. 31,790 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18,130 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14,310గా ఉంది. కంఫర్ట్ 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.
NOTE:
ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.