IRCTC Ganga Ramayan Yatra : హైదరాబాద్ నుంచి గంగా రామాయణ యాత్ర... తక్కువ ధరలోనే 6 రోజుల ప్యాకేజీ -irctc tourism announced ganga ramayan yatra from hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Ganga Ramayan Yatra From Hyderabad City

IRCTC Ganga Ramayan Yatra : హైదరాబాద్ నుంచి గంగా రామాయణ యాత్ర... తక్కువ ధరలోనే 6 రోజుల ప్యాకేజీ

HT Telugu Desk HT Telugu
Apr 14, 2023 08:48 PM IST

IRCTC Ganga Ramayan Yatra Latest: అధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించుకోవాలనే వారికి ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి గంగా రామాయణ్ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు తేదీలతో పాటు ధరల వివరాలను పేర్కొంది.

గంగా రామాయణ్ యాత్ర
గంగా రామాయణ్ యాత్ర

IRCTC Tourrism Hyderabad - Ayodhya Tour: హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో అయోధ్య, ప్రయాగ్ రాజ్, సార్ నాథ్, వారణాసితో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. ‘గంగా రామాయణ్ యాత్ర’ (Ganga Ramayan Yatra)పేరిట ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. విమానంలో పర్యాటకుల్ని తీసుకెళ్లి ఆయా ప్రాంతాలను చూపిస్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజ్… మే4 తేదీన అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Day 01 : హైదరాబాద్ విమానాశ్రయం(Hyderabad Airport) నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరాలి. వారణాసి విమానాశ్రయానికి 9 గంటలకు వరకు చేరుకుంటారు. ఆ తర్వాత హోటల్‌ వెళ్తారు. హోటల్‌లో భోజనం చేసి.. కాశీ దేవాలయం, మధ్యాహ్నం నైమీశర్యణకు వెళ్తారు. రాత్రి లక్నోలోనే బస చేస్తారు.

Day 02 : రెండో రోజు అయోధ్యకు చేరుకుంటారు. పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాత్రి అయోధ్యలోనే బస చేస్తారు.

Day 03 : అయోధ్య ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత ప్రయాగరాజ్ కు వెళ్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.

Day 04 : త్రివేణి సంగమానికి వెళ్తారు. సాయంత్రం వారణాసికి వెళ్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.

Day 05 : ఉదయమే కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి వారణాసిలోనే ఉంటారు.

Day 06 : వారణాసిలోని పలు ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం వారణాసి ఎయిర్ పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ కు చేరుకుంటారు.

టికెట్ ధరలు…

ఈ టూర్ ప్యాకేజీ(IRCTC Ganga Ramayan Yatra) ధర చూసుకుంటే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.22,200గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29,900 చెల్లించాలి. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.36,850 ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్(Travel Insurance) కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన జాబితాను చెక్ చేసుకోవచ్చు.

గంగా రామాయణ్ యాత్ర టికెట్ ధరలు
గంగా రామాయణ్ యాత్ర టికెట్ ధరలు (www.irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ బుకింగ్ తో పాటు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు

IPL_Entry_Point