IRCTC Gujarat Tour 2024 : హైదరాబాద్ - గుజరాత్ ట్రిప్ - బడ్జెట్ ధరలో 8 రోజుల టూర్ ప్యాకేజీ, చూసే ప్రాంతాలివే
IRCTC Gujarat Tour Package 2024 : గుజరాత్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. ఇందులో భాగంగా అహ్మదాబాద్, ద్వారకా, రాజ్ కోట్, సోమ్‌నాథ్, వడోదరతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి……
IRCTC Hyderabad Gujarat Tour Package 2024 : ఈ కొత్త ఏడాదిలో ఇతర రాష్ట్రాల్లోని పలు పర్యాటక, అధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించాలని అనుకుంటున్నారా…? అయితే బడ్జెట్ ధరలోనే ఐఆర్ సీటీసీ టూరిజం అనేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అతి తక్కువ ధరలోనే వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు వీలుగా ఇవి ఉంటున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘SUNDAR SAURASHTRA’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. అహ్మదాబాద్, ద్వారక, రాజ్ కోట్, సోమ్‌నాథ్, వడోదరతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.
ఫిబ్రవరి 14, 2024వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. షెడ్యూల్ చూస్తే…. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.
Day 1 : ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. మధ్యాహ్నం 3 గంటలకు పోరుబందర్ ఎక్స్ ప్రెస్(Train No. 20967) బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
Day 2 : ఉదయం 11 గంటలకు వడోదర స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ కి వెళ్లిన తర్వాత... స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని సందర్శిస్తారు. రాత్రి వడోదరలోనే బస చేస్తారు.
Day 3 : హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత... లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కు వెళ్తారు. ఆ తర్వాత అహ్మాదాబాద్ కు పయనమవుతారు. అక్కడ ఉన్న అక్షరదామం ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి అహ్మాదాబాద్ లోనే బస చేస్తారు.
Day 4 : హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత... సబర్మతి ఆశ్రయంకు చేరుకుంటారు. అక్కడ్నుంచి రాజ్ కోట్ కు వెళ్తారు. మధ్యాహ్నం హెటల్ కి వెళ్లిన తర్వాత... వ్యాస్టన్ మ్యూజియంను సందర్శిస్తారు. గాంధీ మ్యూజియం, స్వామి నారాయణ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి రాజ్ కోట్ లోనే బస చేస్తారు.
Day 5 : హోటల్ నుంచి ద్వారకా చేరుకుంటారు. ఆ తర్వాత జామ్ నగర్ కు వెళ్తారు. తిరిగి ద్వారకకు చేరుకొని రాత్రి ఇక్కడే బస చేస్తారు.
Day 6 : ద్వారకాదిశ్ ఆలయానికి వెళ్తారు. చెక్ అవుట్ అయిన తర్వాత... సోమ్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం సమయానికి పోరుబందర్ కు చేరుకుంటారు. రాత్రి వరకు పోరుబందర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.
Day 7 : అర్ధరాత్రి 12.20 గంటలకు ట్రైన్ సికింద్రాబాద్ బయల్దేరుతుంది.
Day 8 : ఉదయం 08.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
హైదరాబాద్ - గుజరాత్ టికెట్ ధరలు :
IRCTC Hyderabad Gujarat Tour Prices 2024: ఈ సుందర్ సౌరాష్ట్ర టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. డబుల్ షేరింగ్ కు రూ. 28280ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.27610 గా ఉంది. 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కూ రూ. 24,760గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్న పిల్లలకు కూడా వేర్వురు ధరలు ఉన్నాయి.టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం