తీర్థ యాత్రలకు వెళ్లే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూన్ 14 వ తేదీ నుండి జులై 13వ తేదీ వరకు రెండు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డీఎస్జీపీ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. తీర్థ యాత్రకి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఈ యాత్రలో (కాశీ)వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగరాజ్, శృంగవర్పూర్ ప్రాంతాలు దర్శించవచ్చు. ఈ యాత్ర జూన్ 14న ప్రారంభమై 22 వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ.16200, థర్డ్ ఏసీ ధర రూ.26,500, సెకండ్ ఏసీ ధర రూ.35,000 ఉంటుంది.
ఈ యాత్ర స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస, బరంపూర్, భువనేశ్వర్ మీదుగా వెళ్తుంది.
ఉజ్జయిని (మహాకాళేశ్వర్ – ఓంకారేశ్వర్), త్రయంబకేశ్వర్, భీమశంకర్, ఘృష్ణేశ్వర్).
ఈ యాత్రలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీంశంకర్, ఘృష్ణేశ్వర్, ఎల్లోరా, మోవ్, నాగ్ పూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు. ఈ యాత్ర జులై 05న ప్రారంభమై జులై 13వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ.14,700, థర్డ్ ఏసీ ధర రూ.22,900, సెకండ్ ఏసీ ధర 29,900 ఉంటుంది. ఈ యాత్ర స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, నాందేడ్, ముధ్ఖడ్, పూర్ణ మీదుగా వెళ్తుంది.
రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం), వాటర్ బాటిల్, టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, ప్రయాణ బీమా, ఇన్సూరెన్స్ అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితం.
ప్రతి రైలులో 718 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సదుపాయాలు సమకురుస్తారు. కోచ్ కు ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలులో సీసీ కెమెరాలతో కుట్టుదిట్టమైన భద్రత ఉంటుందని తెలియజేశారు.
టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701, 9281030712, 9281495845, 9281030749, 9281030750 లకు సంప్రదించాలని మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్ సైట్ ను సంప్రదించాలని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం