IRCTC Divya Dakshin Yatra:9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాల సందర్శన-తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ రైలు, టూర్ ప్యాకేజీ ఇదే-irctc divya dakshin yatra on bharat gaurav train tour package 9 days covering 7 temples ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Divya Dakshin Yatra:9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాల సందర్శన-తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ రైలు, టూర్ ప్యాకేజీ ఇదే

IRCTC Divya Dakshin Yatra:9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాల సందర్శన-తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ రైలు, టూర్ ప్యాకేజీ ఇదే

Bandaru Satyaprasad HT Telugu
Jul 20, 2024 01:43 PM IST

IRCTC Divya Dakshin Yatra : ఐఆర్సీటీసీ జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రలో దక్షిణ భారతంలోని ప్రముఖ దేవాలయాలను 9 రోజుల్లో దర్శించుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే భారత్ గౌరవ్ రైలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా... అరుణాచలం, రామేశ్వరం, త్రివేండ్రం, కన్యాకుమారి, తంజావూరు వెళ్తుంది.

9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాల సందర్శన- తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ రైలు
9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాల సందర్శన- తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ రైలు

IRCTC Divya Dakshin Yatra : దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు ప్రముఖ దేవాలయాలను దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా 'దివ్య దక్షిణ యాత్ర' టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరువణ్ణామలై [అరుణాచలం] - రామేశ్వరం - త్రివేండ్రం - కన్యాకుమారి-తంజావూరును కవర్ చేస్తూ, 2AC, 3AC, SL తరగతులలో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలు టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉంది. 9 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను సందర్శించవచ్చు. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.14, 250.

దివ్య దక్షిణ యాత్రలో కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరువణ్ణామలై, తంజావూరు, తిరుచ్చి, త్రివేండ్రం కవర్ చేస్తారు. తదుపరి పర్యటన ఆగస్టు 04న సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది.

  • సీట్ల సంఖ్య : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50)

బోర్డింగ్ / డి-బోర్డింగ్ స్టేషన్లు : సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట.

ఒక్కొక్కరికీ ధర

ఎకానమీ -రూ 14250(పెద్దలకు)- రూ 13250( పిల్లలకు(5-11 సంవత్సరాలు))

స్టాండర్డ్- రూ 21900- రూ 20700

కంఫర్ట్- రూ 28450- రూ 27010

ఈ యాత్రలో కవర్ చేసే ప్రముఖ దేవాలయాలు

  1. తిరువణ్ణామలై- అరుణాచలం ఆలయం
  2. రామేశ్వరం- రామనాథస్వామి ఆలయం
  3. మధురై- మీనాక్షి అమ్మ వారి ఆలయం
  4. కన్యాకుమారి- రాక్ మెమోరియల్, కుమారి అమ్మవారి టెంపుల్
  5. త్రివేండ్రం - శ్రీ పద్మనాభస్వామి ఆలయం
  6. తిరుచ్చి - శ్రీ రంగనాథస్వామి ఆలయం
  7. తంజావూరు - బృహదీశ్వరాలయం
  • DAY-01 : సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ రైలు బయలుదేరారు. తెలుగు రాష్ట్రాలలోని కాజీపేట, వరంగల్, విజయవాడ, నెల్లూరు...సహా పలు స్టేషన్లలో ప్రయాణికుల బోర్డింగ్ ఉంటుంది.
  • DAY-02 : తిరువణ్ణామలై స్టేషన్‌కు చేరుకున్న తర్వాత పర్యాటకులను పికప్ చేసుకుని హోటల్ కు తీసుకెళ్తారు. ఫ్రెష్ అయ్యాక అరుణాచలం ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తారు. అరుణాలేశ్వరుడి దర్శనం తర్వాత సాయంత్రం కుదల్‌నగర్‌కు వెళ్లడానికి తిరువణ్ణామలై స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు.
  • DAY-03 : కూడల్‌నగర్ -రామేశ్వరం : కూడల్ నగర్ స్టేషన్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రామేశ్వరానికి తీసుకెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్థానిక దేవాలయాలను సందర్శించవచ్చు. రామేశ్వరంలో రాత్రి బస చేస్తారు.
  • DAY-04 : రామేశ్వరం - మధురై (కూడల్‌నగర్) : మధ్యాహ్న భోజనం తర్వాత రామేశ్వరం నుంచి మధురైకి బస్సులో బయలుదేరారు. మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించుకుని, స్థానికంగా షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది. కన్యాకుమారి ప్రయాణానికి రైలు ఎక్కేందుకు కూడల్ నగర్ స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు.
  • DAY-05 : కన్యాకుమారి : కొచ్చువేలి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో కన్యాకుమారికి చేరుకుని హోటల్ లో దిగుతారు. కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ సందర్శిస్తారు. కన్యాకుమారిలో రాత్రికి బస చేస్తారు.
  • DAY-06 : కన్యాకుమారి - కొచ్చువేలి - తిరుచ్చి : కన్యాకుమారిలోని హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి, రోడ్డు మార్గంలో త్రివేండ్రం బయలుదేరతారు. త్రివేండ్రంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం, కోవలం బీచ్ ను సందర్శించవచ్చు. తిరుచిరాపల్లికి వెళ్లడానికి కొచ్చువేలి స్టేషన్‌లో రైలు ఎక్కుతారు.
  • DAY-07 : తిరుచ్చి / తంజావూరు : తిరుచిరాపల్లి స్టేషన్‌కు రైలు చేరుకున్నాక...హోటల్ కి తీసుకెళ్తారు. హోటల్ లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత శ్రీరంగం ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత రోడ్డు మార్గంలో తంజావూరు (60 కి.మీ.)కి వెళ్తారు. తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. సికింద్రాబాద్ తిరుగు ప్రయాణానికి తంజావూరులో రైలు బయలుదేరుతుంది.
  • DAY-08 , DAY-09 : తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటకుల గమ్యస్థానాల్లో డీ-బోర్డింగ్ చేస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం