తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ జ్యోతిర్లింగ యాత్ర.. తెలుగు రాష్ట్రాల్లో బోర్డింగ్ పాయింట్స్‌ ఇవే..-irctc divya dakshin jyotirlinga yatra for telugu states boarding points list ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ జ్యోతిర్లింగ యాత్ర.. తెలుగు రాష్ట్రాల్లో బోర్డింగ్ పాయింట్స్‌ ఇవే..

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ జ్యోతిర్లింగ యాత్ర.. తెలుగు రాష్ట్రాల్లో బోర్డింగ్ పాయింట్స్‌ ఇవే..

Sarath Chandra.B HT Telugu

హైదరాబాద్‌ నుంచి జ్యోతిర్లంగ- దివ్య దక్షిణ యాత్రను ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌లో 9 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. యాత్రలో భాగంగా అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, త్రిచి, తంజావూర్‌ల మీదుగా ఈ యాత్ర సాగుతుంది.

ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర స్పెషల్

ఏపీ, తెలంగాణలకు చెందిన పర్యాటకులు దక్షిణాదిన ప్రముఖ పుణ్య క్షేత్రాల సందర్శనకు జ్యోతిర్లింగ-దివ్య దక్షిణ యాత్రను ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తోంది. మే 22వ తేదీన సికింద్రబాద్‌ నుంచి యాత్ర మొదలవుతుంది. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయాల్లో బుకింగ్‌లు ఉంటాయి.

హైదరాబాద్‌ నుంచి జ్యోతిర్లంగ- దివ్య దక్షిణ యాత్రను ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌లో 9 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. యాత్రలో భాగంగా అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, త్రిచీ, తంజావూర్‌ల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్ర తొమ్మిది రోజుల పాటు ఏడు పుణ్య క్షేత్రాల మీదుగా సాగుతుంది.

జ్యోతిర్లింగతో దర్శనంతో కూడిన దివ్య దక్షిణ యాత్ర 8రాత్రులు, 9 పగళ్లలో సాగుతుంది. మే 22వ తేదీన ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. అరుణాలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, త్రిచీ, తంజావూర్ మీదుగా సాగుతుంది.

ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైల్లో మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో 460 స్లీపర్‌ బెర్తులు కాగా, 3ఏసీలో 206, సెకండ్‌ ఏసీలో 52 బెర్తులు ఉంటాయి.

యాత్ర ప్రారంభమయ్యే స్టేషన్లు...

దివ్య దక్షిణ యాత్ర బోర్డింగ్‌ సికింద్రాబాద్‌ నుంచి మొదలవుతుంది. భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధరి, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు,కావాలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా సాగుతుంది.

టూర్‌ ధరలు ఇవే..

ఎకనామీ విభాగంలో ఒక్కొక్కరి స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణానికి పెద్దలకు రూ.14,700, పిల్లలకు రూ.13,700 వసూలు చేస్తారు.

స్టాండర్డ్‌ విభాగంలో థర్డ్‌ ఏసీలో పెద్దలకు రూ.22,900, పిల్లలకు రూ.21,700 ఛార్జీ వసూలు చేస్తారు.

కంఫర్ట్‌ విభాగంలో సెకండ్‌ ఏసీలో ప్రయాణానికి రూ.29,900, పిల్లలకు రూ.28,400 వసూలు చేస్తారు. ఒంటరి ప్రయాణికులు షేరింగ్‌ పద్ధతిలో సర్దుబాటు చేస్తారు.

యాత్రలో భాగంగా దర్శించే ప్రదేశాలు...

తిరువణ్నామలైలో అరుణాచల ఆలయం, రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం, మదురైలో మీనాక్షి ఆలయం, కన్యాకుమారిలో కుమారి అమ్మన్ ఆలయం, రాక్ మెమొరియల్‌, త్రివేండ్రంలో పద్మనాభ స్వామి ఆలయం, త్రిచీలో రంగనాథ స్వామి ఆలయం తంజావూరులో బృహదీశ్వరాలయం ఉంటాయి.

మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో యాత్ర మొదలవుతుంది. 23 తేదీ ఉదయం ఏడున్నర తిరువణ్ణామలైలో యాత్ర మొదలవుతుంది. 24వ తేదీ రామేశ్వరం, 25 మధురై, 26న కన్యాకుమారి, 27న త్రిచీ, 28న తంజావూరు చేరుతుంది. 28వ తేదీ రాత్రి 11 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 20వ తేదీ రాత్రి రెండున్నర సికింద్రాబాద్‌ తిరిగిచేరుతుంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం