IRCTC Tour From Hyd: ‘గోల్డెన్ ట్రయాంగిల్’ ట్రిప్.. ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి…-irctc announced golden traingle tour package from hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Announced Golden Traingle Tour Package From Hyderabad City

IRCTC Tour From Hyd: ‘గోల్డెన్ ట్రయాంగిల్’ ట్రిప్.. ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి…

HT Telugu Desk HT Telugu
Nov 02, 2022 12:46 PM IST

IRCTC Tour Packages: హైదరాబాద్ నుంచి గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.

హైదరాబాద్ - ఆగ్రా, ఢిల్లీ టూర్
హైదరాబాద్ - ఆగ్రా, ఢిల్లీ టూర్ (irctc)

IRCTC Tour From Hyderabad: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా ఆగ్రా, ఢిల్లీ, జైపూర్ వెళ్లే వారికోసం కొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. 'GOLDEN TRIANGLE' పేరుతో టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ గురువారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ నవంబర్ 9వ తేదీన అందుబాటులో ఉంది. ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే...

Day 01 - ఉదయం 6 గంటలకు హైదరాబాద్ స్టేషన్ నుంచి (Train No. 12723) రైలు బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 02 - ఉదయం 07.40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... కుతుబ్ మినార్ కు వెళ్తారు. లోటస్ టెంపుల్, అక్షరదామం సందర్శిస్తారు. రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు.

Day 03 - మూడో రోజు రెడ్ ఫోర్ట్, రాజ్ ఘాట్, తీన్ మార్తీభవన్, ఇండియా గేట్ చూస్తారు. రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు.

Day 04 - జైపూర్ కు వెళ్తారు. హోటల్ కి వెళ్లిన తర్వాత హవా మహాల్ సందర్శిస్తారు. రాత్రి జైపూర్ లోనే బస చేస్తారు.

Day 05 - అమీర్ ఫోర్ట్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్ కు వెళ్తారు.

Day 06 - హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత అగ్రాకు వెళ్తారు. మార్గమధ్యలో ఫతేపుర్ సిక్రీకి వెళ్తారు. రాత్రి ఆగ్రాలోనే బస చేస్తారు.

Day 07 - ఉదయం తాజ్ మహాల్ ను సందర్శిస్తారు. అగ్రా ఫోర్ట్ కు వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు అగ్రా రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 08 - సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.

ధరలు ఎంతంటే....

కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ షేరింగ్ కు రూ. 45, 870 ధర ఉండగా... డబుల్ షేరింగ్ కు రూ.27,490, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 21,980 గా ఉండాలి. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. కింది జాబితాలో వివరాలను చెక్ చేసుకోవచ్చు.

ధరల వివరాలు
ధరల వివరాలు ( (www.irctctourism.com))

NOTE

టూర్ ను బుకింగ్ చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవచ్చు.

IPL_Entry_Point