IRCTC Tour From Hyderabad : హైదరాబాద్ టూ రాజస్థాన్.. ఇదిగో టూర్ ప్యాకేజీ-irctc announced golden sands of rajasthan tour package here s complete details
Telugu News  /  Telangana  /  Irctc Announced Golden Sands Of Rajasthan Tour Package Here's Complete Details
రాజస్థాన్ టూర్ ప్యాకేజీ
రాజస్థాన్ టూర్ ప్యాకేజీ (unsplash)

IRCTC Tour From Hyderabad : హైదరాబాద్ టూ రాజస్థాన్.. ఇదిగో టూర్ ప్యాకేజీ

08 November 2022, 18:45 ISTAnand Sai
08 November 2022, 18:45 IST

Rajasthan Tour Package : హైదరాబాద్ నుంచి రాజస్థాన్ టూర్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రకటించింది. ఈ మేరకు వివరాలు పేర్కొంది.

IRCTC Rajasthan Tour Package 2022 : రాజస్థాన్‌లోని పర్యాటక ప్రాంతాలు చూడాలని అనుకునేవారికి శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ అందిస్తోంది. గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్తాన్ (Golden Sands of Rajasthan) పేరుతో టూర్ ప్యాకేజీ ఇస్తోంది. ఫ్లైట్‌లో పర్యాటకుల్ని రాజస్తాన్ తీసుకెళ్తుంది. జైసల్మేర్, జోద్ పూర్, మౌంట్ అబు, ఉదయ్ పూర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. 2022 నవంబర్ 26న టూర్ ప్రారంభమవుతుంది.

Day 1: ఉదయపూర్ ఎయిర్ పోర్టు(Udaipur Airport)కు చేరుకున్న తర్వాత... హోటల్ లోకి చెకిన్ అవుతారు. లంచ్ తర్వాత నథ్ ద్వారాకు వెళ్తారు. తిరిగి ఉదయ్ పూర్ చేరుకున్న తర్వాత... పిచ్చోలా లేక్ సందర్శిస్తారు. రాత్రి ఉదయ్ పూర్ నే బస చేస్తారు.

Day 2 : బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. మౌంట్ అబు(MOUNT ABU)కు వెళ్తారు. తర్వాత దిల్వారా జైన ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం నక్కీ లేక్ కు వెళ్తారు. రాత్రి మౌంట్ అబులోనే బస చేస్తారు.

Day 3: అల్పహారం తర్వాత జైసల్మీర్(JAISALMER)కు వెళ్తారు. బర్మర్ లో లంచ్ ఉంటుంది. తిరిగి జైసల్మేర్‌ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

Day 4: బ్రేక్ ఫాస్ట్ తర్వాత... జైసల్మేర్ ఫోర్టు(JAISALMER Fort)కు చేరుకుంటారు. మధ్యాహ్నం డిసెర్ట్ క్యాంప్ కు వెళ్తారు. అక్కడ క్యామెల్ సఫారీ ఉంటుంది. జీప్ సఫారీ కూడా అందుబాటులో ఉంటుంది. రాత్రి జైసల్మేర్ డిసెర్ట్ క్యాంప్ లోనే బస చేస్తారు.

Day 5: బ్రేక్ ఫాస్ట్ తర్వాత... హోటల్ నుంచి చెక్ అవుతారు. అక్కడ్నుంచి జోద్ పూర్(JODHPUR)కు వెళ్తారు. అనంతరం ఉమేద్ భవన్ ప్యాలెస్ ను సందర్శిస్తారు. రాత్రి జోద్ పూర్ లోనే బస చేస్తారు.

Day 6: బ్రేక్ ఫాస్ట్ చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. తర్వాత మెరంఘర్ పోర్టును వెళ్తారు. మధ్యాహ్నం జోద్ పూర్ ఎయిర్ పోర్టుకు చేరుతారు. అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

GOLDEN SANDS OF RAJASTHAN Tour Cost : కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 41,700 ధర ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 32,800 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.31,600 గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.27950గా టికెట్ ధర నిర్ణయించారు. ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.