కాళేశ్వరంలో సరస్వతి నవరత్నమాల.. స్తోత్రంతో తొమ్మిది హారతులు.. ఇవీ ప్రత్యేకతలు..!-interesting facts about kaleshwaram saraswati pushkaralu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కాళేశ్వరంలో సరస్వతి నవరత్నమాల.. స్తోత్రంతో తొమ్మిది హారతులు.. ఇవీ ప్రత్యేకతలు..!

కాళేశ్వరంలో సరస్వతి నవరత్నమాల.. స్తోత్రంతో తొమ్మిది హారతులు.. ఇవీ ప్రత్యేకతలు..!

కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తొమ్మిది హారతుల గురించి భక్తులు తెలుసుకోవాలని పెద్దలు చెబుతున్నారు. ఏ హారతి ఇచ్చారు.. దానివల్ల కలిగే ప్రయోజనాల గరించి పెద్దలు వివరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు

కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో భాగంగా.. నవరత్నమాల స్తోత్రంతో తొమ్మిది హారతులు నిర్వహించారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

9 హారతులు..

1.ఓంకార హారతి.. సర్వ దోష నివారిణి

2.నాగ హారతి - సర్పదోషాని పోగొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

3.పంచ హారతి - దీర్ఘాయుష్షుకు

4.సూర్య హారతి- రోగాలను మాపి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

5.చంద్రహారతి - పాడి పంటలను, మనః శాంతినిస్తుంది.

6.నందిహారతి - ధర్మ బుద్ధిని, శక్తిని, విద్య బుద్ధినిస్తుంది.

7.సింహహారతి. నాయకత్వాన్ని ధైర్యాన్నిస్తుంది.

8.కుంభహారతి - సంపదను ఇచ్చి, కోటి సుఖాలను అందిస్తుంది.

9.నక్షత్రహారతి - నిర్మలమైన మనస్సును, కీర్తిని అందిస్తుంది.

అరగంట పాటు..

ఈ హారతులను కాశీలో గంగాహారతులు ఇచ్చే ఏడుగురు పండితులచే నిర్వహించారని అధికారులు చెబుతున్నారు. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ 9 హారతులు ఆహుతులను మైమరపింప చేశాయి. కాళేశ్వరం పుష్కరాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు ఏమన్నారో ఓసారి చూద్దాం.

కొండా సురేఖ కామెంట్స్..

'నేను మంత్రిగా ఉన్నపుడు పుష్కరాలు రావడం చాలా సంతోషంగా ఉంది. సరస్వతి తల్లి అనుగ్రహం ఇది. భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని చాలా పక్కగా ఏర్పాట్లు చేశాం. సరస్వతి పుష్కరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. భక్తులకి సరస్వతి దేవి మంచి చేయాలని.. రాష్ట్రంలోని పిల్లలకి విద్య ఇవ్వాలని సరస్వతి కటాక్షం పొందేలా అమ్మవారిని కోరుకున్నాం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు తెలంగాణ వాళ్లే కాకుండా.. పక్క రాష్ట్రాలు వచ్చేలా మంచి ఏర్పాట్లు చేశాం. సరస్వతి కటాక్షం తెలంగాణ విద్యార్థులందరి మీద ఉండాలని ఆ సరస్వతి వేడుకున్న' అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.

శ్రీధర్ బాబు కామెంట్స్..

'దేవాదాయ శాఖ మంత్రి ప్రత్యేక కృషి వల్ల ఈ రోజు పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాం. మొట్టమొదటి సారి కాశిలో ఏవిధంగా హారతి ఇస్తారో సరస్వతి హారతి కాళేశ్వరంలో చేయాలని ముఖ్యమంత్రి సూచన మేరకు.. కాశి నుండి పండితులను ప్రత్యేకంగా రప్పించడం జరిగిందిం. భక్తుల సౌకర్యార్ధం టెంట్ సిటీ కూడా ఏర్పాటు చేశాం' అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

సంబంధిత కథనం