US Indian Student Missing: అమెరికాలో తెలంగాణ విద్యార్ధి అదృశ్యం, మే2 నుంచి అదృశ్యమైన రూపేష్ చింతకింది
US Indian Student Missing: అమెరికాలో మరో భారతీయ విద్యార్ధి అదృశ్యమయ్యాడు. ఉన్నత విద్య కోసం చికాగో వెళ్లిన తెలంగాణకు చెందిన రూపేష్ చింతకింది అనే విద్యార్ధి అదృశ్యం అయ్యాడు. అతని అచూకీ కోసం కుటుంబ సభ్యులు భారత రాయబార వర్గాలకు ఫిర్యాదు చేశారు.
US Indian Student Missing: అమెరికాలోని చికాగోలో భారతీయ విద్యార్ధి అదృశ్యమయ్యాడు. మే 2 నుంచి చింతకింది రూపేష్ అనే యువకుడు కనిపించకుండా పోయాడు.
చికాగోలో వారం క్రితం అదృశ్యమైన రూపేష్ చంద్ర చింతకింది అచూకీ కనుగొనడానికి చికాగో పోలీసులు, స్థానిక ప్రవాస భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ సోషల్ మీడియాలో ప్రకటించింది.
రూపేష్ చంద్ర చింతకిందిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నట్టు చికాగో పోలీసులు ప్రకటించారు. అమెరికాలో గత కొద్ది నెలలుగా భారతీయ విద్యార్ధులపై దాడులు, అదృశ్యమవుతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మే 2వ తేదీ నుంచి ఓ తెలుగు విద్యార్థి చికాగోలో కనిపించకుండా పోయాడు. గత వారం రోజులుగా ఆచూకీ లేదని సోదరుడు ప్రేమ్ చికాగో భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
"భారత్‌కు చెందిన విద్యార్థి రూపేశ్ చంద్ర చింతకింది మే 2వ తేదీ నుంచి కనిపించక పోవడంపై భారత కాన్సులేట్ ఆందోళన చెందుతోందని, అతడి ఆచూకీ కోసం పోలీసులు, ప్రవాస భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రకటించారు.
త్వరలోనే రూపేశ్ అచూకీ తెలుస్తుందని ఆశిస్తున్నామని" చికాగోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. స్థానిక పోలీసులు కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. రూపేష్ చంద్ర అచూకీ తెలిస్తే సమాచారం అందించాలని స్థానికులను కోరారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన రూపేశ్ చికాగోలోని విస్కాన్సిన్లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ కోర్సు చేస్తున్నాడు. వారం రోజులుగా రూపేష్ అచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు అమెరికాలోని రాయబార కార్యాలయాలను ఆశ్రయించారు.
ఎన్ షెరిడాన్ రోడ్డులోని 4300 బ్లాక్ నుంచి రూపేష్ కనిపించకుండా పోయారు.ఈ ఏడాది మార్చిలో కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్థి అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో శవమై కనిపించాడని న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది.
మహ్మద్ అబ్దుల్ మరణవార్త తెలిసి చాలా బాధపడ్డామని, అతని మరణంపై సమగ్ర దర్యాప్తు కోసం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది.
'ఓహియోలోని క్లీవ్ ల్యాండ్ లో గాలింపు చర్యలు చేపట్టిన మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ శవమై కనిపించాడని తెలిసి చాలా బాధపడ్డామని, మహమ్మద్ అర్ఫత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం' అని న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ పోస్ట్ లో పేర్కొంది.
హైదరాబాద్‌కు చెందిన అరాఫత్ 2023 మేలో క్లీవ్ల్యాండ్ యూనివర్సిటీ నుంచి ఐటీలో మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లగా, ఈ ఏడాది మార్చి 7 నుంచి కనిపించకుండా పోయాడు. పది రోజుల తర్వాత అరాఫత్ ను కిడ్నాప్ చేశారని, అతడిని విడిపించేందుకు 1200 డాలర్లు ఇవ్వాలని గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని అతని తండ్రి మహ్మద్ సలీం తెలిపారు.
అమెరికాలో భారతీయ విద్యార్ధులపై ఇటీవలి కాలంలో దాడులు పెరుగుతున్నాయి. ఏప్రిల్ లో ఓహియోలోని క్లీవ్ ల్యాండ్ లో ఉమా సత్యసాయి గద్దె అనే భారతీయ విద్యార్థిని మృతి చెందిన ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చికాగోలో ఓ భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.
సంబంధిత కథనం