Hyderabad Traffic Restrictions : స్వాతంత్య్ర వేడుకలకు గోల్కొండ ముస్తాబు, హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Traffic Restrictions : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గోల్కొండ పరిసరాల్లో రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆంక్షలు విధించారు. గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలకు వచ్చే వాహనదారుల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Hyderabad Traffic Restrictions : పంద్రాగస్టు సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. గోల్కొండ కోట పరిసరాల్లో భద్రతాపర ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాణిమహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వెళ్లే మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గోల్కొండ కోటకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. షేక్‌పేట, టోలీ చౌకీ నుంచి వచ్చే సాధారణ ప్రజల వాహనాలను సెవెన్ టూంబ్స్ లోపల పార్కింగ్‌కు ఏర్పాటుచేశారు. స్వాతంత్ర్య దినోత్సవరం(Independence Day)సందర్భంగా గోల్కొండ కోటలో ఏర్పాట్లను సీఎస్ శాంతి కుమారి పరిశీలించారు.
ట్రెండింగ్ వార్తలు
ట్రాఫిక్ ఆంక్షలు
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్వాతంత్ర దినోత్సవం కోసం గోల్కొండ కోటకు వచ్చే ప్రముఖులు, అధికారుల కోసం ప్రత్యేక పాసులు జారీచేశారు. ఏ గోల్డ్, ఏ పింక్, బీ నీలం, సీ గ్రీన్, డీ ఎరుపు పాసులు ఇస్తున్నారు. సికింద్రాబాద్ , బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం వైపు నుంచి గోల్డ్, ఏ పింక్, ఏ నీలం పాసులు ఉన్న వారిని గోల్కొండ కోట వరకు అనుమతిస్తారు. ఏ గోల్డ్ పాసులు ఉన్న వారి వాహనాలను గోల్కొండ కోట మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న రహదారిపై ఫతేదర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ కు అనుమతిస్తున్నారు. ఏ పింక్ పాసులు ఉన్న వాహనదారులు గోల్కొండ కోట మెయిన్ గేట్ నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న బస్ స్టాప్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
పార్కింగ్ కు ఏర్పాట్లు
బీ పాసులు ఉన్న వాహనదారులు గోల్కొండ బస్ స్టాప్ వద్ద రైట్ టర్న్ తీసుకుని ఫుట్ బాల్ గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. సీ గ్రీన్ పాసులు ఉన్న వాహనదారులు గోల్కొండ పోర్టు మెయిన్ గేట్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ వద్ద తన వాహనాలు పార్కింగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. డీ ఎరుపు పాసులు ఉన్న వారికి ప్రియదర్శిని స్కూల్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. నలుపు పాసులు ఉన్న వాహనదారులు ఫతేదర్వాజా వైపు వెళ్లి హుడా పార్క్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
గాంధీ సినిమా ఉచిత ప్రదర్శన
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపులో భాగంగా ఈ నెల 14 నుంచి 24 వరకు రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో మహాత్మాగాంధీ సినిమా ఉచితంగా ప్రదర్శించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విద్యార్థులలో జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా గాంధీ చిత్రాన్ని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉచితంగా ప్రదర్శించామన్నారు. లక్షలాది మంది విద్యార్ధులు వీక్షించారన్నారు. విద్యార్థులను థియేటర్ల వద్దకు ఉచితంగా తీసుకెళ్లి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తామన్నారు.