TS Winter Update: తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల, జనం గజగజ
TS Winter Update: తెలంగాణలో క్రమంగా చలి తీవ్రత పెరుగుతుంది. తెల్లవారుజాము సమయంలో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతూ వస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నా తెల్లవారు జామున,రాత్రి సమయంలో మాత్రం చలి తీవ్రత పెరుగుతోంది.
TS Winter Update: తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. పది రోజుల క్రితం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనా మూడు నాలుగు రోజులుగా చలి వణికిస్తోంది. చలితీవ్రత నేపథ్యంలో ఉదయాన్నే లేవడానికి జనాలు భయపడుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంది.ఇ
ట్రెండింగ్ వార్తలు
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈశాన్యం నుంచి రాష్ట్రం వైపు చలి గాలులు వీస్తున్నాయి.ఈ కారణంగానే ఉష్ణోగ్రతలు తగ్గుతునట్లుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.ఈశాన్య దిశ నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి పెరిగిందని ప్రకటించారు.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి మెదక్,వరంగల్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుండి 5 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అయ్యాయని అధికారులు అంటున్నారు.
ఆదిలాబాద్,హైదరాబాద్,ఖమ్మం జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదు అయ్యాయని అధికారులు ప్రకటించారు. గరిష్ఠ ఉష్ణోగ్రత ఖమ్మంలో 35 డిగ్రీలు,కనిష్ట ఉష్ణోగ్రత మెదక్ లో 15 డిగ్రీల నమోదు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.
స్వెటర్లు, రగ్గులకు భారీ డిమాండ్..
రాష్ట్రంలో ఒక వైపు క్రమంగా చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వెట్టర్లు, రగ్గులకు అతుక్కు పోతున్నారు.చలి వణికిస్తు ఉండడంతో ప్రజలు స్వెట్టర్లను కొనుగోలు చేస్తున్నారు. చలి కాలం వస్తే స్వెట్టర్లు, దుప్పట్ల వ్యాపారం బాగుంటుందని వ్యాపారస్తులు అంటున్నా వాటి ధరలు మాత్రం బాగా పెరిగాయని సామాన్య ప్రజలు అంటున్నారు.
(రిపోర్టింగ్ తరుణ్, హైదరాబాాద్)