TG Corporations: తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామక ఉత్తర్వులు విడుదల-in telangana the appointment orders of the chairmen have been released for many corporations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Corporations: తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామక ఉత్తర్వులు విడుదల

TG Corporations: తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామక ఉత్తర్వులు విడుదల

Sarath chandra.B HT Telugu

TG Corporations: తెలంగాణలో పలు ప్రభుత్వ కార్పొరేషన్లను ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

TG Corporations: తెలంగాణలో పలు ప్రభుత్వ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కాంగ్రెస్‌ నాయకులు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది నెలలకే పార్లమెంటు ఎన్నికలు రావడంతో నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం జరిగింది.

పార్లమెంటు ఎన్నికలు పూర్తి కావడంతో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై రేవంత్ సర్కారు దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సీడ్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కె.అన్వేష్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ ఛైర్మన్‌గా మనాల మోహన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాయల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీల కార్పొరేషన్ ఛైర్మన్‌గా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ఛైర్మన్‌గా మెట్టు సాయికుమార్‌లను నియమించారు. నియామక తేదీ నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.

37 కార్పొరేషన్లకు చైర్మన్లను ఎంపిక చేశారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అధిష్ఠానం అనుమతితో వారి నియామకాలకు అంతా సిద్ధం చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో కోడ్‌ అమల్లోకి వచ్చి.. ఆ నియామకాలకు సంబంధించి ఉత్తర్వుల జారీ ఆగిపోయింది. జులై-08న కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై జీవో విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది.

కార్పోరేషన్ల ఛైరమన్లు వీరే…కార్పొరేషన్ల ఛైర్మన్లు:

  • హౌసింగ్ కార్పొరేషన్ - ఆర్. గురునాథ్ రెడ్డి
  • ఆర్యవైశ్య కార్పొరేషన్ - కాల్ప సుజాత
  • గ్రంథాలయ పరిషత్ - ఎండీ రియాజ్
  • ఫారెస్ట్ డెవలప్ మెంట్ - పోడెం వీరయ్య
  • స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ - ఎన్. గిరిధర్ రెడ్డి
  • మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్ - జనక్ ప్రసాద్
  • ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - ఎం. విజయబాబు
  • అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ - చల్లా నరసింహారెడ్డి
  • శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - కె. నరేందర్ రెడ్డి
  • కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - ఇ. వెంకట్రామిరెడ్డి
  • హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ - నాయుడు సత్యనారాయణ
  • మైనారిటీస్ కార్పొరేషన్ - ఎం.ఏ. జబ్బార్
  • రోడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - రాంరెడ్డి మల్రెడ్డి
  • మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - అనిల్ ఎరావత్
  • ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ - ఐతా ప్రకాశ్ రెడ్డి
  • పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ - నిర్మల జగ్గారెడ్డి (జగ్గారెడ్డి భార్య)
  • బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ - నూతి శ్రీకాంత్
  • రాష్ట్ర సాంకేతిక సేవల అభివృద్ధి కార్పొరేషన్ - మన్నె సతీశ్ కుమార్
  • ఎస్సీ కార్పొరేషన్ - ఎన్. ప్రీతమ్
  • షెడ్యూల్డ్ ట్రైబ్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - బెల్లయ్య నాయక్
  • గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - కె. తిరుపతి
  • మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - జె. జైపాల్
  • టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ - పటేల్ రమేశ్ రెడ్డి
  • ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - బంద్రు శోభారాణి
  • ఫుడ్ కార్పొరేషన్ - ఎం.ఏ. ఫహీం
  • సంగీత నాట్య అకాడెమీ - అలేఖ్య పుంజల
  • తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ - కె. శివసేనా రెడ్డి
  • వికలాంగుల కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - ఎం. వీరయ్య
  • విత్తనాల అభివృద్ధి సంస్థ - ఎస్. అన్వేష్ రెడ్డి
  • వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ - కాసుల బాలరాజు
  • కోఆపరేటివ్ యూనియన్ - మనాల మోహన్ రెడ్డి
  • ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ - జ్ఞానేశ్వర్ ముదిరాజ్
  • రాష్ట్ర సహకార ఆయిల్ సీడ్స్ ఉత్పత్తిదారుల ఛైర్మన్ - జంగా రాఘవరెడ్డి
  • స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ - రాయల నాగేశ్వరరావు
  • రాష్ట్ర మత్స్య సహకార సంఘం ఛైర్మన్ - మెట్టు సాయి కుమార్.