Mlc Kavitha Bail: లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట, విచారణ రెండు వారాలు వాయిదా-in liquor scam mlc kavitha did not get relief the trial was postponed for two weeks ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha Bail: లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట, విచారణ రెండు వారాలు వాయిదా

Mlc Kavitha Bail: లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట, విచారణ రెండు వారాలు వాయిదా

Sarath chandra.B HT Telugu
May 10, 2024 12:25 PM IST

Mlc Kavitha Bail: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణను రెండు వారాల పాటు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ విచారణ రెండు వారాల వాయిదా
ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ విచారణ రెండు వారాల వాయిదా (ANI )

Mlc Kavitha Bail: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ నాయకురాలు కవితకు ఊరట దక్కలేదు. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను రెండు వారాల పాటు వాయిదా వేశారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభిప్రాయాన్ని ఢిల్లీ హైకోర్టు కోరింది.

yearly horoscope entry point

దీంతో తదుపరి విచారణను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. మనీలాండరింగ్ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు మే 6న ఇచ్చిన ఉత్తర్వులను కవిత ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు.

ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసులో కూడా ట్రయల్ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. 2021-22 సంవత్సరానికి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

కవితను ఏప్రిల్‌ 15న హైదరాబాద్ లోని బంజారాహిల్స్ నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెను ఆ తర్వాత సీబీఐ అరెస్టు చేసింది.

గత వారం ట్రయల్‌ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలతో కవితను ఈసీ అరెస్టు చేసింది. దిల్లీ లిక్కర్ పాలసీ(Delhi Liquor Policy)లో కవితపై సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం కవిత దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు.

ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కవిత.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాలని బెయిల్ అభ్యర్థించారు. అంతకుముందు కుమారుడి సంరక్షణ కోసం బెయిల్ ఇవ్వాలని కోరగా కోర్టు నిరాకరించింది. మహిళగా పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం తనకు బెయిల్‌కు అర్హత ఉందని కోర్టు ట్రయల్‌ కోర్టుకు తెలిపారు. కవిత పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.... బెయిల్ తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా కవితను అరెస్ట్‌ చేశారని కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ(CBI) అక్రమంగా అరెస్ట్‌ చేసిందని కోర్టుకు తెలిపారు. కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ, సీబీఐ న్యాయవాదులు వాదించారు.

కవిత ఈ కేసులో కీలకమైన వ్యక్తి అని...ఆమె సూత్రధారి కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్‌ పిటిషన్లు తిరస్కరించింది. ఆ తర్వాత ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ అభిప్రాయం కోరిన ఢిల్లీ హైకోర్టు రెండు వారాల పాటు విచారణ వాయిదా వేసింది. ఎమ్మెల్సీ కవితతో పాటు డిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో పలువురు ప్రముఖులను ఈడీ,సిబిఐలు అరెస్ట్ చేశాయి.

Whats_app_banner

సంబంధిత కథనం