TS Cyclone Effect: తెలంగాణపై మిగ్‌జామ్‌ తుఫాను ప్రభావం-impact of ongoing michaung cyclone in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Cyclone Effect: తెలంగాణపై మిగ్‌జామ్‌ తుఫాను ప్రభావం

TS Cyclone Effect: తెలంగాణపై మిగ్‌జామ్‌ తుఫాను ప్రభావం

HT Telugu Desk HT Telugu

TS Cyclone Effect: మిగ్‌జామ్‌ తుఫాను ప్రభావం తెలంగాణపై కనిపిస్తోంది. ఆంధ్రపదేశ్ లోని బాపట్ల లో తీరం దాటిన తుఫాన్ ఉత్తరంగా పయనించే క్రమంలో బలహీనపడింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణలో వర్షాలు (unsplash.com)

TS Cyclone Effect: మిగ్‌జామ్‌ తూఫాన్ ప్రభావం తెలంగాణపై కనిపిస్తోంది. బాపట్లలో తీరం దాటిన తుఫాన్ ఉత్తరంగా పయనించే క్రమంలో బలహీనపడింది.బుధవారం మధ్యాహ్నం సమయానికి అల్పపీడనంగా మారి కోస్తా,దక్షిణ ఓడిశా,ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను అనుకొని తెలంగాణలోని ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతోంది.

గురువారం అదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్,నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ,నల్గొండ,పెద్దపల్లి,వనపర్తి, నాగర్ కర్నూల్,జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు తో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

కొత్తగూడెం జిల్లాలో అత్యధిక వర్షపాతం....

ఇదిలా ఉంటే బుధవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాలో వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యప్తంగా బుధవారం 22.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట,మద్దుకూరు లో అత్యధిక వర్షపాతం నమోదైంది.

ఇటు హైదరాబాద్ లో చలి గాలులు తీవ్రత పెరిగింది.తుఫాన్ ప్రభావంతో గడిచిన మూడు రోజులు గా పగులు,రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.బుధవారం హైదరాబాద్ రాజేంద్రనగర్ లో 18.5 , హయాత్ నగర్ లో 18.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.సాధారణ కంటే నగరంలో 6-7 డిగ్రీలు నమోదు అవుతుండడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. తెల్లవారుజామున రహదారులపై మంచు కప్పెయ్యడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.మరో నాలుగు రోజుల పాటు మిగ్‌జామ్‌ తుఫాన్ ప్రభావం వల్ల మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

కేతిరెడ్డి తరుణ్