Adilabad Weather: అదిలాబాద్‌ను వణికిస్తున్న చలిపులి
Adilabad Weather: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. కనీస ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతున్నాయి.
Adilabad Weather: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, మంచిర్యాల అదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరం భీం జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు ఎక్కువవుతోంది. రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
ఈ క్రమంలో మనుషులే కాకుండా పశువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పశువుల కోసం గోని సంచులు కుట్టించి తొడుగుతున్నారు. గత మూడు రోజులలో 12 డిగ్రీ ల నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
జిల్లాలోని సిర్పూర్ మండలంలో బుధవారం 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తెలంగాణలో నమోదైన అతి స్వల్ప ఉష్ణోగ్రతలలో అదిలాబాద్, కొమురం భీం, నిర్మల్ జిల్లాలు ఉండడం గమనారం.
జిల్లాలోని గిన్నె దారిలో 8.1°, అదిలాబాదులో 9.4 డిగ్రీలు, కొమురం భీం జిల్లాలో 10.4°, నిర్మల్ జిల్లాలో 11 డిగ్రీలు, మంచిర్యాలలో 11.8° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజులుగా చలిగాలు వీస్తుండడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే జంకుతున్నారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆరుబయటే ఎండలో పాఠాలు బోధిస్తున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు కశ్మీరును తలపిస్తున్నాయి. జనాలు బయటికి వచ్చేందుకు జంకుతున్నారు, పల్లెలలో ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లడానికి రైతులు వెళ్తున్నారు. గ్రామీణ రోడ్లలో పొగమంచి ఏర్పడడంతో వాహనాలు నడపడానికి భయపడుతున్నారు
రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
sa