ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం నాటి బులెటిన్ ప్రకారం…..ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుమలు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చు
ఇక ఈనెల 6వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మరోవైపు హైదరాబాద్ లోని జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందుగానే అప్రమత్తమైన జలమండలి అధికారులు.. జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ సూచించారు.
జంట జలాశాయల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో… మరోసారి మూసీ పరివాహక ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
మరోవైపు ఏపీలో కూడా వర్షాలు పడనున్నాయి. ఇవాళ ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. మరో మూడు నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు పడే సూచనలున్నాయి. ఇక ఉత్తరాంధ్రలోని లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సంబంధిత కథనం